Friday, December 8, 2023

శివోహం

నీ గమ్యం చేరడానికి ఎంత దూరమైన
నడవాలని ఉండాలే గాని ఈ కాళ్ళు చాలు ...

బాద అయినా సంతోషం అయినా 
భరించేందుకుగుప్పెడు గుండె చాలు ...

నా జీవితం సంతోషంగా ఉండాలంటే...
నీ చల్లని కారుణకటాక్షాలు చాలు.....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీకు నీవుగా అభిషేకం 
ఆత్మ ప్రదక్షిణ చేసి చూపి
ఆచరించగ తెలుపు చున్నావా
మహేశా . . . . . శరణు

శివోహం

హరహరా....
మహాదేవా...
శంభోశంకరా...
నీ పాద స్పర్శ కై...
ఎదురుచూసే...
ఓ దినుడు...
నిత్యం నిన్నే తలుస్తున్నాడు..
మహాదేవా శంభో శరణు.

Thursday, December 7, 2023

శివోహం

స్థూలరూపంతోనూ...
సూక్ష్మ రూపంతోనూ...
మహారౌద్రరూపంతోనూ కనిపించేతల్లీ.. మహాశక్తిస్వరూపిణీ జగజ్జననీ...
మహాపాపాల్ని హరించేదేవీ మహాలక్ష్మీ...
నీకు నమస్కారము.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా!మా చూపు తిప్పి
లో చూపు మప్పగా
తెలియ వచ్చారా మీరిలా
మహేశా . . . . . శరణు .

Wednesday, December 6, 2023

శివోహం

శివా!తోలుతిత్తి రూపానికి పేరొకటుంది
పేరులేని తేజానికి రూపం లేకుంది
నేను నీవైతే నామరూపాల  పనియేముంది
మహేశా . . . . . శరణు .

శివోహం

లోక కళ్యాణం కొరకు నీవు గరళాన్నే మింగావు...
నాపాప క్షయానికి ఈమాత్రం బాధలు పడలేనా ఏంటి...
నాబాధలను నీనామ ప్రవాహం అదుపు చేయదా ఏంటి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...