Wednesday, January 3, 2024

శివోహం

శివ!!!
గమ్యం తెలియని తోడు లేని ప్రయాణం నాది...
అయోమయ ప్రయాణాని కి అర్థం లేని తొందర...
అదే జీవితం నా జీవితం...
భయాలతొ బాధల బరువు తొ
సాగే ఒంటరి నడక లో...
నా శాశ్వతమైన తోడు నీవని...
ఏరికోరి ఎన్నుకున్న నిన్ను...
పాల ముంచిన నీట ముంచిన నీదే భారం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

దర్శక నిర్మాత...
వ్రాసావు నారాత...
నటనలో నడక రాక...
పడుతున్నా తికమక...
మారుతున్నవి రోజులా...
మాయదారి మనుషులా....
కాలానుగుణంగా కధలు వ్రాయక...
నాకులాంటి వాడి బాధ నీకు వేడుక...
నంది పక్కనే పడుంటాను...
పాత్ర మార్చి కరుణించవా...
మహాదేవా శంభో శరణు...

Tuesday, January 2, 2024

శివోహం

"నేను"
దూరం అయితే తప్ప
నీదైన గమ్యాన్ని చేరలేనా కదా శివ ఇదంతా...
అలాగే కానియండి మరి.
శివ నీ దయ.

3శివోహం

కష్ట, సుఖాలలో నాకు తోడుగా ఉన్న ఆత్మ బంధువు నీవే
నీ నామమే నను నడుపుతున్న బలం.
కృతజ్ఞతలు శివా!
మహాదేవా శంభో శరణు.

Monday, January 1, 2024

శివోహం

శివ నీ దయ తో బంధాలకు బంధుత్వలకు దూరంగా
ఐనా రెండూ ఎక్కువే..
ప్రేమైనా...
బాధయినా సమమే నాకు..

శివోహం

శివా!కనిపిస్తావో అనిపిస్తావో నీ దయ
కంట చూస్తావో కంఠమే కోస్తావో నీ యిష్టం
కడకు నేను లేకుండా నీవైపోయేలా చూడు .
మహేశా . . . . . శరణు .

శివోహం

నేను కోరకుండానే నువ్వు నాకిచ్చిన నిరాడంబరమైన గొప్ప వరాలు: ఆకాశమూ, కాంతీ, నా ఈ దేహమూ, జీవితమూ, మనస్సు

వీటికి నన్ను అర్హుణ్ణి చేసి 
అత్యాశలవల్ల కలిగే ఆపదలనించి రక్షిస్తున్నావు

నా జయాపజయాలనించి బహుమానంగా 
నేను సంపాయించిన హారాలతో 
నిన్ను అలంకరిస్తాను దేవా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...