Saturday, January 13, 2024

శివోహం

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.

శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

శివోహం

ఉన్నదంతా అసత్యమే...
అసలు సత్యం తెలిసే వరకే మిత్రమా మనసుకు గుచ్చుకున్న ముళ్ళ కొమ్మల బాధ...
నీవు ఎవరో తెలుసుకో...
వచ్చిన పని చూసుకో...

ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

భగవంతుడు కావలనుకుంటే శరణు కోరడమే ముఖ్యోపాయము  

నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 

నీ గుణాల్ని పొగడి నిన్నూ చేరాలనుందయ్యా  
నీవు గుణాలను దాటిన గుణ రహితుడ వయ్యా  
నిన్నూ నా మనసులో నిల్పుకోవాలినుందయ్యా 
నీవు అంతులేని మహిమగల విశ్వవ్యాప్తుడయ్యా 

చేతులారా పూజిస్తూ, ప్రార్ధించాలని ఉందయ్యా 
నీవేమో, అనంత శరీరం తో, వి స్వవ్యాప్తుడవయ్యా   
నీ కోరిక ఏదన్నా ఉంటే, తీర్చాలనీ ఉందయ్యా 
నీ వేమో, సమస్త కోరికలు తీరిన వాడవయ్యా 

నిన్నూ కనులారా చూసి, తరిద్దామని ఉందయ్యా 
నీ వేమో చూపుకే దొర్కని, ఆగోచర మూర్తివయ్యా 
ఉపాయంతో నిన్నూ చేరలేనని, అర్ధం ఆయిందయ్యా 
శ్రీనివాసుని శరణు కోరటమే, నాకు దిక్కయ్యా 

నిన్నూ, చేరుకునే, సత్య ఉపాయము ఏదయ్యా 
ఆది, నంత్యము లేని, అచ్యుత మూర్తి నీవయ్యా 
అందుకే అన్యధా శరణం నాస్తి. తమ్వేవ శరణం గోవిందా.

Friday, January 12, 2024

శివోహం

నా గుండె గూటిలో ఉన్నది నీరూపమే మహాదేవా.. 
నాలుగు గదులు మీరు నలుగురు...
ఊపిరి నందితో నేననునిత్యం నీ
రూపాన్ని నాగుండెపై చిత్రించుకుంటాను...
నిదురలో మెలకువలో మీరే నా ధ్యాస
చెరగనీయకు నీ చిత్రాన్ని
చెదరనీయకు నా హృదయాన్ని

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!కన్నీటి దారల కడలి సృష్టించావా
కలతల మాదిరి కెరటాలు తెలిసేను
లవణ మాత్రముగ రుచిని తెలిసేను
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!లుకలుకలు కూడినవే లౌకిక బంధాలు
తికమకలు పెట్టేవే జీవిత పయనాలు
లుకలుకలు రాలనీ ,తికమకలు తొలగనీ 
మహేశా . . . . . శరణు .

Thursday, January 11, 2024

శివోహం

కాలాన్ని తిట్టిపోయక తప్పట్లేదు...
అమాయకత్వం నటించడం నేర్పనందుకు.

ఓం నమః శివాయ.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...