సముద్రంలో కలిసే నదిలా
సాగి పోతున్నా శివా
వేషాలు వేసే నటుడిలా
వేస్తూ బ్రతుకు తున్నా శివా
భూమిపై ఎందుకున్నానో తెలవలా
భూమికి భారంగా ఉండలేను శివా
పాత్ర ఔచిత్యంలో బ్రతికే దెలా
బ్రతుకే ఒక నాటక మైనది శివా
వయసుకు న్యాయం చేయలా
ప్రేమను పంచ లేకపోతున్న శివా
ఏమి పొందానో ఏమి కోల్పోయానో ఎలా
ఏమి జ్ఞప్తికి రాని జీవి నైనాను శివా
ఆశయం వదలి ఆశకు చిక్కాను ఎలా
ప్రకృతికి భార మైనాను శివా
జీవన పోరాటంలో నీవు గుర్తుకు రాలా
నిన్ను పూజించక నిర్లక్ష్యం చేశా శివా
నా అజ్ఞానాన్నీ మన్నించేది ఎలా
నన్ను కరుణించి కాపాడవా శివా
కుటుంబం కోసం ఆరాటపడి బ్రతికేదెలా
నీ శాన్నిత్యాన్ని పొందాలని ఉంది శివా
తెలియదు నీ అనుగ్రహము పొందేదెలా
కార్తీక మాసం పూజ చేస్తున్నా శివా
మూర్ఖత్వ వాత్లల్యంతో బ్రతికేదేలా
నాతండ్రిగా నాకు మోక్షము ఇవ్వవా శివా.