Sunday, February 4, 2024

శివోహం

కర్మలు చేయకుండా ఉండలేం...
కర్మ ఫలితాలు అనుభవించకుండా తప్పించుకోలేం...
ఈ కర్మ వలయాన్ని భేదించుట అంత సులువు కాదు కానీ దైవ స్ఫురణ, నామ స్మరణ కర్మలు దగ్ధం అవ్వడానికి దారి.

శివ నీ దయ.

Saturday, February 3, 2024

శివోహం

శివా!ప్రతి రూపున వెలుగుతున్నావు
ప్రతి పేరున ప్రభవించు చున్నావు
ప్రభలు నీవేనయ్య పేరు పేరునా
మహేశా . . . . . శరణు .

శివోహం

రోజుకో గంట ధ్యానంలో క్షణకాల భాగ్యం...
లోకాన్ని చూసే కన్నులు తప్ప నిన్ను చూసే
నేత్రాలు లేవు...
ఏ కోరిక కొరను నిన్ను జ్ఞాన భిక్ష జ్ఞాన నేత్రాలు తప్ప.

శివా నీ దయ
మహాదేవా శంభో శరణు.

Friday, February 2, 2024

శివోహం

చమత్కారం చురుక్కు మంటుంది
ఛీత్కారం గురించి చెప్పేదేముంది
ఏ కారమయినా మమకారం ముందు దిగదుడుపే.
ఓం నమః శివాయ

శివోహం

శివా!విశ్వాన్ని చూడగ రెండు కళ్ళు
విశ్వ నేత్రుని చూడగ ఒక కన్నూనా
ఏక నేత్రమున నీ ఎఱుక సాధ్యమా
మహేశా . . . . . శరణు .

Thursday, February 1, 2024

శివోహం

శివా!సోమసూర్య నేత్రద్వయ
సిగ పాయల సోముడైతే
సూర్యుడెక్కడో మరి ఎఱుక చేయి
మహేశా . . . . . శరణు .

శివోహం

నా ఆధ్యాత్మిక భక్తి ప్రపంచమంతా నీ "ఓం" కార నాదం తో పరిప్రబ్రమిస్తుంది...
దీనిని విన్నా,స్మరణ చేసినా నా మనస్సు ఏకాగ్ర చిత్తముగా మారుతుంది.

శివ నీ దయ
మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...