Monday, February 19, 2024

శివోహం

శివా!అంతటా నిండివున్న నిన్ను 
ఆలయాన ఆర్తిగా చూస్తూ
అంతరాన తెలియ వెతుకుతున్నాను
మహేశా . . . . . శరణు .

శివోహం

సృష్టి - స్తితి - లయములకతీతుడైనా వాడు...
జ్ఞానము ఆనంద మున నిమగ్నుడు వాడు   
స్పటిక కాంతుడు వాడు...
పులిచర్మ దారి 
అభయప్రదాతా శరణు.

మహాదేవా శంభో శరణు.

Sunday, February 18, 2024

శివోహం.


నీ ఒక్కడికి దగ్గర అవ్వడం కోసం..
ఎంతో మందికి దూరం అయ్యాను...

శివ నీ దయ.

శివోహం

తనువు తగలడిపోతే తళుకు బెళుకులు కాలంలో కలిసిపోతాయి...
వైరాగ్యం గుండెల్లో నిను నింపుకుని నిదానంగా నడిస్తే
అదే కాలంలో పది కాలాల పాటు నిలిచిపోతాను...
ఈ రెండింటికి నడుమ మనసు తలరాతకు అడ్డువచ్చి నా నడకను ఎగుడుదిగుడుగా నడిపిస్తుంది...
మరి ఏదీ నీ దయ శివా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

నీటి బుడగ లాంటి మనిషి జీవితానికి...
ఎన్ని అలంకారాలు చేసినా....
ఎన్ని మెరుగులు దిద్దినా...
ఎన్ని రంగులు వేసినా  అది తాత్కాలికమే.

శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

Saturday, February 17, 2024

శివోహం

పగలంతా బాధ్యతల బరువు
రాత్రంతా నన్ను నేను అన్వేషించుకుంటూ
నిన్ను చేరే ప్రయత్నంలో గతానికి, వాస్తవానికి మధ్యన నలుగుతున్న మనసు తపన ఇది. 
గుప్పెడు అక్షరాలతో గంపెడు భక్తి తో కలిపి రాసిన నా ఆధ్యాత్మిక భక్తి  ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham  మరో తరాలకు భక్తి తో శివ తత్వం ను బోధిస్తుంది అని నితో ఇలా

శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!జాలము చేసి
భారము మోసి
గంగను భరించుటేల
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...