Thursday, February 22, 2024

శివోహం

పట్టు పంచ విడిచి పులి చర్మాన్ని కప్పుకున్నావు
నీవెంతటి పేదవాడివో...
వజ్ర వైడూర్యాలు వద్దని మెడలో పాముని అలంకరించుకున్నావు నీవెంతటి సామాన్యుడివో...
రాజువైన ఐరావతాన్ని వదిలి నందిని వాహనంగా పెట్టుకున్నావు నీవెంతటి వీరుడివో...
భక్తులు పిలిస్తే పరుగున పరిగెత్తుకొస్తావు నీవెంతటి దయా హృదయుడవో.
మహాదేవా శంభో శరణు.

Wednesday, February 21, 2024

శివోహం

శివా!శిలను నీవే , శిల్పాన నీవే
రెండుగా మెండుగా రూపించుచున్నా
నిండి వున్నది నిజముగా నీ తేజమే
మహేశా . . . . . శరణు .

శివోహం

నటనలో నాది అందెవేసిన చెయ్యే కాకపోతే జీవిత నాటకంలో ఓడిపోయాడంతే.

శివ నీ దయ.

శివోహం

సుఖ:దుఖాలు కల్పించేది నీవే శివ...
ప్రకృతిని జీవరాసిని అనుక్షణం రక్షించేది కూడా నీవే...
సుఖం వచ్చినప్పుడు ఆనందం పెరుగుతుంది అది నీవే కల్పించినవని గ్రహించలేక ద:ఖం వచ్చినప్పుడు కుమిలిపొతూ కష్టాలు తొలగించమని నిన్ను  ప్రాధేయపడడం మనవునిగా సహజం.
శివ నీ దయ.
మహాదేవా శంభో శరణు.

Tuesday, February 20, 2024

శివోహం

నా జీవన పయనం నీ కోసం..
కాలం కరిగిపోయినా...
వయసు తరిగిపోయినా...
చూపు చిన్నబోయినా...
మాట మూగబోయినా...
ఆగను ... ఆపను ...
నడుస్తూనె ఉంటా నిన్ను చేరేవరకు..
పిలుస్తూనె ఉంటా నువ్వు పలికేవరకు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!దేహంగా వున్న ఈ నేను ,ఆ నేను కాదు
దేహంలో వున్న ఆ నేను తెలియరాదు
ఈ గజిబిజి నేనును గుర్తెరుగనీయి
మహేశా . . . . . శరణు .

Monday, February 19, 2024

శివోహం

నీది కాని నీ తనువుని చూస్తూ,
మురిసిపోతూ తడబడి పోతూ,
తమకపు కన్నుల చప్పుడు చేస్తూ,
తప్పులుచేస్తూ తిప్పలు పడుతావు ఎందుకు జీవా మహాదేవుడి పాదాలు పెట్టుకో కలిమయా నుండి తప్పించుకో...

ఓం పరమాత్మనే నమః
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...