Monday, March 4, 2024

శివోహం

శివ,
నువ్వు అందరిలా కాదు...
రావటం ఆలస్యం చేయవు...
లోపం నాలోనే
నా పిలుపులో
నా తలపులో
నా ఆర్తిలో
నా సేవలో
నా భక్తిలో
లోపమే
కన్నీటితో నిన్ను కొలిస్తే కరగని కఠిన హృదయం కాదు నీది
తపము చేసిన అసూరులకే లెక్కలేనన్ని వరాలు ఒసగావు
నిన్నే నమ్మి కొలిస్తే నీవు నా గుండె గుడిలో
వచ్చి చేరవా.
మహాదేవా శంభో శరణు.

శివోహం

చెంప తడిని ఇంపుగా హత్తుకుంటూ ఆవేదన ఆరాధన అవుతుంది...
అన్యమేరగని నాకు నీవు తప్ప ఎవరున్నారు ఆవేదన నీకు నివేదన గా సమర్పిస్తున్నా.

శివ నీ దయ.

శివోహం

శివా!ఓంకారానికి రూపమై
సాకారానికి సాక్ష్యమై
అరూపరూపిగా అగుపించు చున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

నీ జీవితం ఎంత మందితో, ఎన్నెన్నో సంబంధ బాంధవ్యాల తో ముడిపడి ఉన్నా నీ మనసు పుస్తకంలో భగవంతుడు సృష్టించిన ఒక పేజీ నీకంటూ నీకోసం ఖాళీ గా ఎదురు చూస్తూనే ఉంటుంది...
"నువ్వు ఏమి రాస్తావో అని" అది సంతోషమో, దుఃఖమో, త్యాగమో, దైవమో, మోక్షమో....
ఇంకెందుకు ఆలస్యం పూరించు...
బహుశా ఆ ఖాళీ పేజీ యే నీ ఆత్మ కావచ్చు.

ఓం శివోహం... సర్వం శివమయం.

Sunday, March 3, 2024

శివోహం

శివ,
నీ పాదకుసుమవ్వాలనే కామాన్నిన్కలగనివ్వు...
నిన్ను చేరక పలుతావుల తిరిగే మనసు పై క్రోధాన్ని పెరగనివ్వు...
నిరంతరం నిన్ను నా కనులారా చూడాలనే మోహాన్ని  నిలువనివ్వు...
నీవు నా స్వామివనే లోభాన్ని వుండనివ్వు...
నా ఆర్తిని వేడుక తో చూసే నీపై నన్ను నీ దరికి చేర్చుకోలేదనే మాత్సర్యాన్నీ కలగనివ్వు...
నువ్వు  కల్పించిన ఈ అరిషడ్వర్గాల పాషాలనుబ్నీ దరికి చేర్చే  ప్రణవమార్గాలుగా  మారనివ్వు.
మహాదేవా శంభో శరణు.

అయ్యప్ప నా స్వామి

ప్రార్థించే ముందు నమ్ము...
నమ్మకమే నిజమైన ప్రేమ...
మాట్లాడే ముందు ఆలకించు...
అప్పుడే మాటలలో పటుత్వం ప్రేమ...
పొందే ముందు సంపాదించు...
అదియే నిన్ను ఆదుకొనే ప్రేమ...
రాసే ముందు ఆలోచించు...
వ్రాతలు హృదయాన్ని తాకే ప్రేమ...  
నిర్జీవమయ్యేలోపు అందరి గుండెల్లో జీవించు...
అదే కదా నిజమైన ప్రేమ.

ఓం శివోహం...సర్వం శివమయం.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శివా!అడ్డుకన్నుల చూపు అడ్డుకుంటోంది
నిలువుకన్ను తెరచి నిన్ను చూడ
ఆ అడ్డు తొలగి నిన్ను నిలువునా చూడనీ
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...