Friday, May 3, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
మహిలో మట్టీని తీసి తడిపి 
ముద్దగ చేసి ప్రతిమలుగా దిద్ది 
చేసిన బొమ్మలకు ప్రాణం పోసి
ఆశలు కల్పించి బంధాలను చేసి
అవణి మీద ఆటలాడిస్తావు నీవు
మేముచేసిన నేరమేమి స్వామీ
మా తప్పులు మన్నించి ఒప్పుగా భావించి
భక్తి మార్గము ముక్తి మార్గము చూపుము స్వామీ.
మహాదేవా శంభో శరణు.

Thursday, May 2, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
దుఃఖ నివారిణి
దుర్గా భవాని
ధరణి సంరక్షణి
దయ చూపవమ్మా
నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా తల్లి.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

సర్వమూ సమస్తమూ 
అయిన తల్లిదండ్రులూ... 
అంతటా ఉన్న మిమ్మల 
ఆలస్యంగా తెలుసుకుంటిని
ఆలస్యంగా నా ఇంటికి మిమ్మల ఆహ్వానించితినీ.. 
పార్వతీ పరమేశ్వరా
ఈ బిడ్డ ను మన్నించండీ 
కైలాస పరివారమునకు కోటి నమస్సులు 

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నా ఈ దేహం పునీతమవ్వాలంటే
అనుభవతీర్ధంలో ఎన్ని మునకలేయాలో...
ఎన్నాళ్ళీ ఈ దాగుడుమూతల ఆటలు..
వేగలేకున్నాను హర  ముగింపు పలుకు.
మహాదేవా శంభో శరణు.

Wednesday, May 1, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
కరుణాళుడు కాదా ప్రభు నీవు...
నీ చరణ ధూళి పడరాదా నా మీద
హరహరహర అంటే మన నీ భక్తి ఆకలి తీరి పోదా.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నను కాపాడడానికి నీ కృప ఉండగా నాకు భయమేల హర
బోళాశంకర అని నీ నామము ఉండగా నాకు భయమేల...
రుద్ర కోపం శాంతమాయే నీ చిత్తము ఉండగా నాకు భయమేల...
దుర్గుణాల తర రక్షింప నీ శరణాగతి ఉండగా నాకు భయమేల...
కర్మ బంధాలు తప్పించ నీ భక్తి మార్గము ఉండగా నాకు భయమేల...

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఈ ప్రకృతి అంతా ఈశ్వరుడే...
ఈ సృష్టి అంతా ఈశ్వరుడే.
ఈ సృష్టి అంతా సద్గురు

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...