Saturday, May 4, 2024

శివోహం

శివా!చదువుకొనగ నిన్ను సంప్రదించాను
చెట్టు క్రిందకు చేరి నమస్కరించాను
చదువుకు మూలమైన నీవే శరణమన్నాను
మహేశా . . . . . శరణు .

Friday, May 3, 2024

గోవిందా



నీ సన్నిధియే పరమానందం
నీ చల్లని చూపులే కరుణామయం!
నీ అభయం నాకేల భయం!
నీ భక్తుల కోర్కెలు శాంతం వినడం
నీ దర్శనం మాకు మహాద్భుతం
ఓం నమో వెంకటేశయా
ఓం పరమాత్మనే నమః

శివోహం

శివ!
ఏమని చెప్పేది...
ఎలాచెప్పేది  
నీవు దేవదేవుడివి 
నేను సామాన్య మానవుణ్ణి 
కర్మ బద్ధుణ్ణి, కనికరం అంటే తెలియనివాణ్ణి
దారి తెన్నూ తెలియక నీ చెంత చేరుతున్నవాణ్ణి...
నీ కృపా కటాక్ష వీక్షణాలను
నాపై ప్రసరించిన నా బుద్ధి మారునేమో 
నా పాపాలు తొలుగునేమో 
నా  అంతరాత్మ ప్రభోధంగా 
నీ చెంత చెరియన్నను, నీవే నాకు దిక్కు.
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
మహిలో మట్టీని తీసి తడిపి 
ముద్దగ చేసి ప్రతిమలుగా దిద్ది 
చేసిన బొమ్మలకు ప్రాణం పోసి
ఆశలు కల్పించి బంధాలను చేసి
అవణి మీద ఆటలాడిస్తావు నీవు
మేముచేసిన నేరమేమి స్వామీ
మా తప్పులు మన్నించి ఒప్పుగా భావించి
భక్తి మార్గము ముక్తి మార్గము చూపుము స్వామీ.
మహాదేవా శంభో శరణు.

Thursday, May 2, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
దుఃఖ నివారిణి
దుర్గా భవాని
ధరణి సంరక్షణి
దయ చూపవమ్మా
నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదా తల్లి.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.