Saturday, May 11, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ...
నాకంటూ పెద్ద ఆశలు ఎమీ లేవు...
హృదయం ఉప్పొంగి నోరారా నాన్న అని
పిలుస్తా...
నా వైపు దయచూడు చాలు.
నువ్వే గురువు అని నమ్మి నమస్కరిస్తా ఆదుకొని చేయి అందించి కర్తవ్యం బోధించు...
ప్రేమ తో ఓ ఆలింగనము అర్ధిస్తా...
ఆత్మీయ కౌగిలి తన్మయత్వంలో తడిపి ఉంచూ...!
లోక వ్యవహారాలతో విసిగి నీ భుజము పై తలవాల్చుత... ఒక్క చిరునవ్వుతో అన్యం మరిచిపోయేలా తన్మయ వర్షం తో నను సమ్మోహన పరచు.
మహాదేవా శంభో శరణు.

Friday, May 10, 2024

గోవిందా

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
గగనమే నీ దర్శనము...
క్షణమే దివ్య వీక్షణం...
అపురూపము తిరుమల ప్రయాణము వైకుంఠపురము దివ్య ధామము...

ఓం నమో వెంకటేశయా.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ మహా దేవుని దీపారాధన మనలో
వెలిగే ఆత్మ జ్యోతి శివుని దర్శన భాగ్యం కలిగిస్తుంది..
సంపదలన్నీ ఈశ్వరునివే అందరికీ అన్నీ ఇచ్చి తాను
ఏమీ ఎరుగని వాడి మాదిరి అనిపిస్తాడు...
సంపదలు ఇచ్చే కుబేరుడే శివారాధన చేస్తాడు...
మనమూ శివ మహాదేవుని ముందు దీపారాధన చేద్దాం
సంతృప్తి అనే సంపద పొందుదాం

ఓం శివోహం సర్వం శివమయం.
ఓం పరమాత్మనే నమః.

ఓం నమః శివాయ

ఈనాటి మానవ సంబంధాలలో ఇతరుల తో నటిచడమే కాకుండా మనతో మనం కుడా నటిస్తూనే వున్నాము. బతికే ఈ నాలుగు రోజుల కోసం ఇలా మనతో మనం కుడా నటించడం అవసరం అంటారా!! ఒక్క సారి ఆలోచించండి...?

మన స్వార్ధం కోసం వాళ్ళ మీద వీళ్ళకు వీళ్ళ మీద వాళ్ళకు చెప్పి మనం లాభ పడటం సమంజసమా!!

పైకి తీయగా మాట్లాడుతూ మనకింద గొయ్యి చాలా నేర్పు గా తవ్వడం కొంత మందికి దేముడు ఇచ్చిన గిఫ్ట్.

నాకనిపిస్తుంది చెప్పేవాళ్ళు ఎప్పుడు వుంటారు, విని నమ్మే వాళ్ళది తప్పు అని.

విన్నది నిజమా!! కాదా!! అన్నది మన విజ్ఞతలో వుండాలి. దేముడు మనకు ఆలోచన ఇచ్చింది మంచి చెడు బేరీజు వేసుకుని మనం మంచి నడవడి తో జీవించడానికి, మృగాలుగా జీవించడానికి కాదు. మన అన్న స్వార్ధం వుండాలి కాని ఎదుటి వాడి నాశనాన్ని చూసేది కాకుండా వుండాలి. అప్పుడే మనం మన పిల్లలు అందరు బాగుంటారు.

మనిషి గా పుట్టినందుకు మానవ సంబంధాలను అనుబంధాలను, ఆప్యాయతలను మర్చి పోకండి. మనీషి గా బ్రతకండి.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అన్యకోరికలు కోరా
అన్య దేవతలను తలవను
పదేపదే నెమరువేసుకొని నీరూపనామాన్ని స్మరించుకోవటానికి
క్షణకాలం కనిపించి మాయమైన చాలును...
మహాదేవా శంభో శరణు.

Thursday, May 9, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పరుశురాముని జన్మదినం 

గంగ భూమిని తాకిన పర్వదినం 

త్రేతా యుగం మొదలైన దినం శ్రీకృష్ణుడు కుచేలుడిని కలుసుకున్న దినం 

వ్యాసుడు వినాయకుడి సహాయం తో మహాబారయం వ్రాయడం మొదలుపెట్టిన

అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన దినం 

కుబేరుడు శ్రీమహాలక్మి తో సమస్త సంపదలకు రక్షకుడిగా నియమిచబడిన దినం

ఆదిశంకరులు కనకధారా సూత్రం చెప్పిన దినం 

అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం 

ద్రౌపదిని శ్రీకృష్ణుడు ధుశ్శసన బారి నుండి కాపాడిన దినం 


ఆత్మీయులకు అక్షయతృతీయ శుభాకాంక్షలు.

 

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నీవు సదా శివుడవు...
నేను నీకు సదా వశుడనే
నీ దివ్య రూపమునకు పరవశుడనే
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...