Friday, July 5, 2024

శివోహం

శివా! నీ భక్తి ప్రపంచంలో నేను
ఈ భక్త ప్రపంచంలో నీవు
కనిపించి కనిపించక కదలాడుతున్నాం
మహేశా  . . . . . శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఎన్ని రకాలుగా నీ నామ స్మరణ చేసిన మెప్పించలేకపోయా..
నా భక్తి ఆలాపనలో అపశృతులనే నువ్వు గమనిస్తూన్నవేమో.

శివ నీ దయ.

Wednesday, July 3, 2024

శివోహం

శివ నీ దయ
https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

Tuesday, July 2, 2024

శివోహం

శివ!
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలో మునగాలని నే తాపత్రయం పడుతుంటే
జారనివ్వొద్దని వేడుకున్నా కన్నీటి సంద్రం ముంచుతావేమయ్య...
జారే ప్రతి బొట్టులో నీ రూపమే కనిపిస్తుంది తండ్రి.

శివ నీ దయ.

శివోహం

శివా!మందితో కూడ మనసు లేదు
నందితో కూడి నడువలేను
చింతలేక నీ చెంత చేరనీ
మహేశా . . . . . శరణు .

Monday, July 1, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
నాలో జీవుడు
నీవు ఆడుకునే
బొమ్మ అనేనా
నా వెనక నుండి
నన్ను పరుగెత్తించి
నీ ఒడిని చేర్చుకుంటూ
నేలపై పడవేస్తున్నావు
ఎన్నాళ్ళు ఈ ఆటలు శివా
నీ బొమ్మ నీ దగ్గరే ఉంచుకో
మహాదేవా శంభో శరణు

శివోహం

శివ!
నీకు తెలుసు నాడు నేను నీ దాసుడిని అని...
ఇప్పుడేమో క్రోధారాజు కొలువులో పడి నేడు దాసుడైతి...
నీ దాసుడు మరొకరికి దాసుడు అవ్వడం నీకు న్యాయమేనా
నీ మౌనం తో నా హృదయం నిశ్శబ్దం నీరయ్యింది..
ఓసారిటొచ్చి నా కళ్ళను తుడిచిపోవూ.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...