Saturday, July 27, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఉత్తమమైనది ఈ మానుష జన్మ...
జన్మజన్మాలుగా చేసిన పుణ్యాల ఫలం...
నీ పదసన్నిధి అది ఎంతటి భాగ్యం
విమలమైన మానసం ప్రశాంత జీవనం
నిశ్చల భక్తి నాకు ప్రసాదించు హర...
నిర్మల ఆసక్తిని కలిగించు సర్వేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

Thursday, July 25, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ
నీ కృపా కటాక్ష వీక్షణ దయా భిక్ష ఆశీర్వాదాలతో...
భుజించే ముందు కొన్ని మెతుకులు
ముందుగా సమర్పించడం నీకు నైవేద్యమే కదా తండ్రీ ...

నిదురపోయే ముందు నిన్నే తలచుకుంటూ మది పాడుకునే పావననామంనీకు పవళింపు సేవే కదా తండ్రీ ...

మేలుకొలుపులో నిన్నే ఆరాధిస్తూ శ్వాసిస్తూ హృదయం ఆలపించే గీతం నీకు సుప్రభాతమే కదా తండ్రీ ...

ఇవన్నీనీవు సమకూర్చిన సుఖాలే తండ్రీ నీవిచ్చిన ఈ సౌఖ్యాలను
నీకు సమర్పించడానికి కూడా ...
సవా లక్ష సందేహాలు ఎందుకో.

మహాదేవా శంభో శరణు

Wednesday, July 24, 2024

శివోహం

ఆపద్భాంధవా ఆంజనేయ
        ఆత్మ రక్షక ఆంజనేయ
        ఆనందస్వరూపఆంజనేయ
        నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ

శివోహం

శివా!మాడు మూసి మాయ చేసి
మమ్ము మోహంలో ముంచేసి
తెలియ నీయవేమి తేట తెలివి.
మహేశా . . . . . శరణు .

Sunday, July 21, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
భ్రమ అని తెలుసు
బ్రతుకంటే బొమ్మలాటని తెలుసు...
శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు...
ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ
తెలుసు..
అన్ని తెలిసి జరిగేది,జరుగుతోంది నిత్యమని శాశ్వతమని ఈ వెర్రి పుర్రెకి ఎంత మిడిసిపాటో కదా..
ఈ పుర్రె నీ పాదముకింద పగిలే రోజు ముందుంది అని తెలుసు...
నీ ఆట బొమ్మ అని తెలుసు.

శివ నీ దయ.

Saturday, July 20, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివ!
అమరుల నిను మెప్పించిరి...
అసురులు నిను ద్వేషించిరి...
బ్రహ్మాది దేవతలు మునులు
మహావిష్ణువు నిను చేరి కోరి
అసుర ఆగడాలు వివరించి
నివారణ తరుణోపాయము
కోర విష్ణుమూర్తి గరళం
సృష్టించ దాచితి కంఠమున
ఆ విధమున సురుల రక్షించి
అసుర సంహార కారకుడైన
నినుచేరి ప్రార్థించు నను
దయతోడ కావుము
ఫణి భూషణ పార్వతీ పతిదేవ
పరమేశ్వరా పాహిమాం పాహి.

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...