Sunday, August 4, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
త్రిగుణాల సత్వగుణం
నీ స్మరణ సమయాన
మాత్రమే నిలుస్తుంది
బతుకు పోరాటంలో
ఆ రెండు గుణాలు లేకపోతే
నేటి కాలంలో గెలవలేం
ఆదుకుంటావని నమ్మకం ఈశ్వరా
త్రిగుణాలు నీవే తీసేసుకుని నా 
దశదిశలా సప్తస్వరాల రాగాలాపనతో
పంచాక్షరీ నామస్మరణ చేస్తూ
అష్టదిక్కుల్లో కొలువై ఉన్న నిను 
చూసి తరించే భాగ్యం ప్రసాదించు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నేను ఉన్నంత వరకు నువ్వు
నువ్వున్నంత వరకు నేను
మనము ఉన్నంత వరకు మన స్నేహం
ఎప్పటికి ఈలానే ఉంటుంది మిత్రమా"

Friday, August 2, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
కలువ లాంటి బుద్ధివ్యర్థాలతో భారం అవుతుంది...
మందగమనం తో బుద్ది మూల చేరుతుంది.
హంస లాంటి మనసు కల్మషాలతో కలుషితం అయి...
కాకిలా రోదిస్తూ నన్ను నేను సమాధాన పరుచుకోలేక నీ సాంగత్యం కోరుతుంది...

శివ నీ దయ.

Thursday, August 1, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓ మనసా...
ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళు
ఇంకా   ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఓ మనసా..
కాలం  కరుగుతోంది...
సమయం  కొంతే  మిగిలి ఉంది...
శివుని  జ్ఞానం  తెలుసు కో...
అజ్ఞానం  తొలగించు కో...
నిన్ను  నీవు  తెలుసు కో...
చింతలను   కరిగించు కో...
బ్రహ్మ రాతను   తెలుసు కో..
కర్మలను   కరిగించు కో..

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, July 29, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీపాద ధూళిని గ్రహించి లోకాల్ని 
సృష్టించు నలువకు నీవె కర్త 
ఈ ధూళి తలదాల్చి హరిమోయు భువనాలు
ఆయాస పడకుండ  నీవె కర్త
ఈ ధూళి హరుడుయే ఒడలెల్ల పూసియు
నిను భక్తి తొ కొలుచు నీవె కర్త
త్రిముర్తి లీలల చేసేటి పనులకు
ప్రతిసృష్టి తరుణము నీవె కర్త

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, July 27, 2024

శివోహం

శివా!నీ నామ శతకాన పేరు దాల్చి
పేరు పేరున నీ నామ స్మరణ జేసి
వేడు చుంటిని కదా నిన్ను చేర
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...