Tuesday, August 6, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
కంట నీరుతో చేరాను నీ పాదము కడగా 
గంగ పొంగులో కన్నీరు జారిపోయే 
ఏమి సేతును నా నీడ నన్ను అట్టి ఉండే 
నీ అడుగుల కడపడి ఉందు నీలకంఠ. 

స్వామి సుందర చైతన్యానంద

Monday, August 5, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అష్ట దిక్కుల నడుమ
అష్ట లింగము లతో వెలసిన
అగ్ని భూతేశ్వర 
అరుణచల లింగేశ్వర.
ఆజ్ఞతో విశ్వకర్మ చే పృధ్వీ పై నిలిచావు
కల్యాణ  కారివై విశ్వాన్ని శుభకరం చేసావు.
అరుణ చల శివ ఆనంద శేష
అగ్ని లింగ వాసా శరణు.

అరుణాచల శివ శరణు.

Sunday, August 4, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
త్రిగుణాల సత్వగుణం
నీ స్మరణ సమయాన
మాత్రమే నిలుస్తుంది
బతుకు పోరాటంలో
ఆ రెండు గుణాలు లేకపోతే
నేటి కాలంలో గెలవలేం
ఆదుకుంటావని నమ్మకం ఈశ్వరా
త్రిగుణాలు నీవే తీసేసుకుని నా 
దశదిశలా సప్తస్వరాల రాగాలాపనతో
పంచాక్షరీ నామస్మరణ చేస్తూ
అష్టదిక్కుల్లో కొలువై ఉన్న నిను 
చూసి తరించే భాగ్యం ప్రసాదించు.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నేను ఉన్నంత వరకు నువ్వు
నువ్వున్నంత వరకు నేను
మనము ఉన్నంత వరకు మన స్నేహం
ఎప్పటికి ఈలానే ఉంటుంది మిత్రమా"

Friday, August 2, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
కలువ లాంటి బుద్ధివ్యర్థాలతో భారం అవుతుంది...
మందగమనం తో బుద్ది మూల చేరుతుంది.
హంస లాంటి మనసు కల్మషాలతో కలుషితం అయి...
కాకిలా రోదిస్తూ నన్ను నేను సమాధాన పరుచుకోలేక నీ సాంగత్యం కోరుతుంది...

శివ నీ దయ.

Thursday, August 1, 2024

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఓ మనసా...
ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళు
ఇంకా   ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఓ మనసా..
కాలం  కరుగుతోంది...
సమయం  కొంతే  మిగిలి ఉంది...
శివుని  జ్ఞానం  తెలుసు కో...
అజ్ఞానం  తొలగించు కో...
నిన్ను  నీవు  తెలుసు కో...
చింతలను   కరిగించు కో...
బ్రహ్మ రాతను   తెలుసు కో..
కర్మలను   కరిగించు కో..

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...