Sunday, September 8, 2024

శివోహం

శివా!
నా నోటనైన నుదిటినైన వెలిగేది నీ నామమే
నా చిత్తమునైనా చితినైనా మెరిసేది నీ తేజమే
నా పలుకైనా పిలుపైనా  విరిసెది నీ స్మరణమే 
మహేశా  . . . . . శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అన్ని దోషాల మూటలే
మోయలేని ఈ భారాలను ఎవరి తల అయినా ఎంత కాలం మోస్తుంది...
దూరాలు దుర్భరాలు కాకుండా ఉండాలి అంటే భారాలను దించుకోవాలి 
వరించండం తేలిక కాదు
భారాలను బాధలను ఎత్తుకొనే వాళ్ళు ఎత్తి పెట్టేవాళ్ళు ఎందరైనా ఉంటారు..
దించుకొనే వాళ్ళు దించి పెట్టేవాళ్ళు
ఎక్కడున్నారు 

అందుకనే  అందరి బ్రతుకులు
మోయలేని భారాలుగా 
భరించలేని శాపాలుగా మారి పోతున్నాయి

బాధలను హరించేవాడు
పాపాలను తుడిచి పెట్టేవాడు
పరమేశ్వరుడు ఒక్కడే
అపరాధాలను మన్నించ మని
అనుగ్రహాన్ని అందించి
ప్రయాణాన్ని సుగమంగా మార్చమని
ప్రార్థిస్తూ భగవంతుని హర హర మని ఎలుగెత్తి పిలుద్దాము...

ఓం నమః శివాయ
ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, September 7, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీ రూపం నా ఊహలో మెదిలినప్పుడల్లా...
నా కళ్ళ నిండా నవ్వులే...
మనసు నిండా ఆనందమే తండ్రి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఆదిపూజ్యుడికి అభివందనం…
పార్వతీనందనుడికి ప్రియవందనం…
ముల్లోకాలనేలే మూషికవాహనుడికి మనసే మందిరం…
విఘ్నాలను తొలగించే వినాయకునికి
అఖండభక్తకోటి అందించే అపూర్వ నీరాజనం…

మీకూ, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు…

Friday, September 6, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
రెండు ఊపిరుల నడుమ క్షణకాలం ఆగిన సమయంలో నిశ్శబ్దానివి నీవు...
ప్రాణాయామం తర్వాత మౌనంలో శబ్దానివి నీవే కదా పరమేశ్వరా
అయితే అనుక్షణం ఆ భావనలో మమ్మల్ని నిలపవేమి మహేశ్వరా.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ప్రణవంతో మొదలై...
ప్రళయంతో ముగిసే...
ఈ జగతి నీ సంకల్పమే కదా తండ్రి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కాలస్వరూపిణి...
మూలశక్తి...
చైతన్యకారిణి...
చిన్మయమూర్తి...
జగమును నడిపించుజనయిత్రి...
జనులనుకరుణించు జగధ్ధాత్రి...
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...