Wednesday, September 18, 2024

శివోహం

శివ!
ధ్యానం లో నిను చూడగలను కానీ చేర లేను...
జీవంతో అనుభూతి పొందగలను కానీ నిను తాక లేను...
ఆత్మనని తెలిసాక ఈ మాయ నాటకంలో నటన ఎవరి కోసం అంతరాత్మ లో  ఒదిగాక విభిన్న పాత్రల పోషణ  ఎందు కోసం.
ఎన్నాళ్లని చూడాలి నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి...
దేహమే భారమని తెలిసినా సందేహమే ఇక లేదని  తెలిసినా...
ఎన్నాళ్లని చూడాలి నీ సన్నిధి చేరుటకు ఏన్నేళ్లని   ఎదురు చూడాలి.

మహాదేవా శంభో శరణు.

Sunday, September 15, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీవు ఒకడివే...
నీవు నేను రెండుగా మారావు...
1. నీవు (శివుడు)
2. నేను (జీవుడు)
నేను తెలిసే వరకూ నీ నామమే నాకు సదా స్మరణం...
నీ స్మరణమే నాకు శరణ్యం.

మహాదేవా శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఏ వైభవమూ వద్దు నీ విభూది  చాలు...
ఏ సంపదలూ వద్దు నీ సన్నిధి  చాలు...
ఏ బంధాలు  వద్దు నీ అనుబంధం చాలు.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శత్రువుల గర్వాన్ని అనిచే ఆంజనేయ...
జ్ఞాన దీపాన్ని వెలిగించే ఆంజనేయ...
మోక్షప్రాప్తిని సిద్ధింప చేసే ఆంజనేయ...
ఓం నమో నమో శ్రీ సీతారామ భక్తాంజనేయ శరణు.

Tuesday, September 10, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

హనుమా!
నీ రూపే వేరు
భక్తికి పరాకాష్ట నీ నడక
రాముడు లేని చోట నీవుండవు
శ్రీరామ నామము జపిస్తూ
నీవు నడయాడే నేల పవిత్రము
వీరులకు వీరుడు ఎవరంటే
నీవె...
అతి భయంకర వీరుడవు
లంకను రావణ చెరనుండి
రక్షించిన శ్రీరామ భక్తుడవు
మము నీ అక్కున చేర్చుకోవయ్య ఆంజనేయ.

శ్రీరామదూత హనుమ శరణు.
జై శ్రీరామ్.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...