Thursday, December 5, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఆకలి నియమాలను మాయచేసేస్తుంది...
ఆశలు కోరికల కోటలో గూడు కట్టుకొంటున్నాయి...
ఆ కోరికలే నన్ను నీకు దూరం చేస్తున్నాయి
కానీ ఒకటే ఒక కోరిక తండ్రి నా తాపత్రయమంతా నీ పాదాల  చెంత చోటు కోసమే.

మహాదేవ శంభో శరణు.

Wednesday, December 4, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
అంతా నీవే...
నీవు లేని ప్రాంతము అంటూ లేదు...
అంత నీవే    
అంతట నీవే నీవే...
అంతరాత్మలో నీవే...
సకలభూతాలలో ఉండే జీవశక్తివి  నీవే 
సర్వాంతర్యామిగా  ఉండే దైవం నీవే...
సకలభూతాలలో ఉండే జీవశక్తివి  నీవే...
సర్వాంతర్యామిగా  ఉండే దైవం నీవే...
జఠరాగ్నిని శాంతపరిచే ఉదరశక్తివి నీవే...
అన్నపు శక్తిని పెంచేటి దైవం నీవే...
సర్వానికి జ్ఞానం అందించే వేదశక్తివి  నీవే
అంతర్గత భావన్ని కల్పించే దైవమ్ము నీవే 
భక్తునికి నిజం తెలిపే వివేకమ్ము నీవే  
వినయ విధేయతా భావమ్ము నేర్పేది నీవే.
మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఏదోఒకరోజు
నిన్ను అందుకుంటా 
నేను నిర్వీర్యమైనా సరే 
నిన్ను చేరుకుంటా 
నేను నిస్తేజమైనా సరే 
నాకు కావలసింది నువ్వే తప్ప మరేమీ కాదు 
భౌతికమూ,లౌకికమూ 
ఏది ఏమైనా సరే నేను శూన్యమైనా సరే నిన్నే చేరాలి.

మహాదేవ శంభో శరణు. 

Tuesday, December 3, 2024

Monday, December 2, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా ఈ శరీరమనే రథం లో కూర్చుని...
నా కర్మ అనే పగ్గాలు బిగించి
సారథ్యం వహించే నా తండ్రీ లోకపాలకునివి నీవుండగ పాలకులతో మాకు ఏల...
దేవదేవునివి నీవుండగా మాకు చింతలేలా
మా ఆలన పాలన చూడ ఇక బయమేలా.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

ఇదేమి విచిత్రమే శివ...
నిన్ను చూడాలంటే నే కనులు మూయలి...
నన్ను నీవు చూడాలంటే నీవు కనులు తెరువాలి...
నిన్ను చూడాలని నా మనసు ఆరాటపడుతోంది...
నా కనులు ముపించి ని దరికి చేరుస్తావో లేక నీవు కనులు తెరిచి నన్ను దర్శన మిస్తావో నీ దయ తండ్రి...

మహాదేవ శంభో శరణు.

క్రిష్ణ గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

పరమాత్మ
పరంధామా
పరమేశ్వర
పావనా
శుభ
పరంబ్రహ్మా
వరదాయక
కృష్ణా
కావర నిన్నే నమ్మితి హరి
వసుదేవ సుతా శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...