Tuesday, December 10, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

నీ హృదయ స్థానం ప్రేమ కు ఆలవాలం...

పార్వతీ పరమేశ్వర సమాయుక్తం
జీవుని పరవశ ఉన్మత్తం.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
చేతికి సంకెళ్లు వేసీ,పాప పుణ్యాలు చేయిస్తుంటావు... 
మనస్సుకు శాంతి కల్పించకా మమ్ము ఆడిస్తూ ఉంటావు...
సంసార పోషణకూ సంపద కొరకూ తిప్పు తుంటావు...
భోగవిరాగముల చుట్టూ, తిప్పి సంతోష పడతావు...
మంచో చెడో, తెల్సుకునే శక్తి ఇవ్వక మాయ చేస్తావు...
ఇష్టాల్ని కష్టాలుగా, కష్టాల్ని ఇష్టాలుగా మారుస్తావు...
అన్యమేరగని మాకు నీవేగతి, వేరు దారి లేదు మా కర్మల సంబంధాన్ని స్వీకరించి 
భోగ, మోక్ష, ఫలము నిచ్చు వాడవు మా కష్టం కడ తేర్చే సమర్దుడవు నీవే హర.

మహాదేవ శంభో శరణు.

Sunday, December 8, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నీకు నాకూ మద్య భవబంధాలే అడ్డ...
దూరం చెరపాలని  ద్వారాలయితే తెరుస్తున్నా...
కానీ...
అంతులేని సంఘర్షణలు నాలో,
ఆ ఆలోచనలతో..
నాకు నేనే భారమవుతున్నా,
పరిగెత్తుకు నీ దరికి చేరలేను 
పరితపించే మనసుకు
సర్ధిచెప్పలేను.

శివ నీ దయ.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
నా నేత్రాలకు ఆరాటం నిన్ను దర్శించాలని...
నా ఊహల కలలకు ఆరాటం 
నీ ఊహే రావాలని...
నా మాటలకు ఆరాటం నీతోనే సంభాషించాలని...
ఆహా! ఎంత సుందరము స్వామి నీ రూపము?
కనులకు  నిండుగా నా మనసు పండగే.

మహాదేవ శంభో శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
కలత ఆలోచనలతో అలిసిపోయాను...
సమస్యల కొలతతో సొలసిపోయాను...
తలపు లేని నిశ్శబ్దపు మనసులో
ఆశనిరాశగా మారింది ఇది ఏమి సోధ్యం...
ఇది కేవలం ఒక భక్తి పరీక్షగా భావిస్తాను 
ఊహించా కాలమార్పుల్లో ఇది ఒక మార్పని.

మహాదేవ శంభో శరణు.

Friday, December 6, 2024

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివ!
ఆశనిరాశగా మారింది ఇది ఏమి సోద్యమో
ఇది కేవలం ఒక భక్తి పరీక్షగా భావిస్తాను తండ్రి...
నా ఆణువణువూ నిండిన దైవం నీవు ...
నిరంతర స్మరణ దైవం...
మమ్ము రక్షించే మా దైవం 
నాలో ధైర్యాన్న నింపి
అధైర్యాన్ని తోలగించి
చెడును తొలగించి
మంచిని అందించి
శౌర్యాన్ని అందించు.

మహాదేవ శంభో శరణు.

Thursday, December 5, 2024

శివోహం

శివా!నీ పాద ద్వయమెక్కడో తెలియలేదు
అభయ హస్తమేదో అగుపించలేదు
కారుణ్య నేత్రాలు కనిపించలేదు ఏమిటిలా
మహేశా . . . . . శరణు .

శివా!చక్రధారివి నీవు కాకున్నా
జగతి చక్రము నీవె తిప్పుతున్నావు
జగదీశ్వరునిగా తెలిసి యున్నావు
మహేశా . . . . . శరణు .

శివా!తేజము తప్ప రూపములేని నిన్ను
రూపించు చున్నావు మా భావన ఎరిగి
భాసించు చున్నావు అభేదమెరుగ
మహేశా . . . . . శరణు .

శివా!సిగ నిండిన చల్లదనమెల్ల
జంట కన్నుల జేరి కరుణుగా మారి
జడ దారల జారి గంగా పొంగె
మహేశా . . . . . శరణు .

శివా!అక్షయమైనది నీ తేజం
విలక్షణమైనది నీ రూపం
అది అక్షులకందుట అపురూపం
మహేశా . . . . . శరణు .

శివా!కానరాని కంటికి కానవచ్చావా
కోర్కెలన్నీ ఒక్కసారి కాలిపోవు
కనిపించి భస్మాని కాననీయి
మహేశా . . . . . శరణు .

శివా!నేను నీ రాజ్యంలో వుంటూ
నీవు నాలో వున్నావనికంటూ
నేను రాజుగా బతికేస్తున్నా
మహేశా . . . . . శరణు .

శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ
నీ నామము నా పదమున దీపిక కానీ
నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ
మహేశా.....శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...