Friday, February 28, 2025

శివోహం

శివా! "నేను"
శవంగా మారక మునుపే నను 
జీవమున్న మనిషిగా తీర్చిదిద్దు
జీవాత్మ తల్లడిల్లి పోతుంది బాధగా 

శివా! "నేను"
నిను చేరక ముందే నను మేలుకొలుపు 
నిను నిత్యం ఆరాధించు దారి చూపించు 
నా నడకలు నీవైపు నడిచే విధం బోధించు

శివా!  "నేను"
ఏ జన్మలలో చేసుకున్న పుణ్యమో  
ఈ జన్మమున మానవునిగ పుట్టాను
నిజానికి నేనే నాడైనా మనిషిగ నడిచానా

శివా! "నేను"
దాన ధర్మములు ఏమి చేయలేదు 
నను సాయమడిగిన వారిని ఆదరించ లేదు 
నేను నేనను అహము నాలో చావడం లేదు 

శివా! "నేను"
నలుగురిలో పుట్టి పెరిగి పెద్దవాడినై, ఆ
నలుగురి కోసం ఏనాడు ఆలోచించ లేదు,
కలిమి లేముల తేడాలతో దూరం చేసుకున్నాను

శివా! "నేను"
మారిపోయాను, నన్ను మన్నించి మంచి 
దారి చూపించు నిజమైన మనిషిగా మసలేలా
కరుణించి నిను చేరే లోపు నను మానవునిగా మార్చు

Wednesday, February 26, 2025

శివోహం

అతను మాట
ఆమె అర్ధం
ఆమె పట్టు
అతను విడుపు
అతను సగం
ఆమె సగం
అతను పుట్టుక లేని వారు
ఆమె ప్రతి పుట్టుక మహా పురాణం
ఆమె ప్రేమ
అతను ప్రతిరూపం
ఓం శివాయ...సర్వం శివమయం 
                             @మోహన్ వాంకుడొత్@

Tuesday, February 11, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

కుడి ఎడమ కనుల...
నిను మనసారా కాంచితిని...
నోరారా కీర్తించితిని...
భజనలు చేసితిని...
ఉదయం నుండి సాయంత్రం వరకూ నేతిరిగిన అన్ని ప్రదేశాల నిన్ను ఆరాధించితిని...
రాత్రికి నిన్ను గుర్తు చేసుకుంటూ ఆరెండు కనులు మూసి...
బయట నేతిరిగిన నిమిషాలు మూడవ నేత్రంతో కాంచుకునేలా...
లోపల క్షణాలుగా నిన్ను తలంచు చున్నాను...
లోపలనుండి నీవెలుగుతో నన్ను నడిపించవా శివా...
పగలు మెలకువలో రాత్రి నిదురలో అనునిత్యం నీ స్మరణే నాకు శరణ్యం...

మహాదేవా శంభో శరణు...

Sunday, February 9, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

బాహ్యంలో నా "నేను" ఊరేగుతూ
అంతరంలో నా "నేను" కు దూరమై
ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు నావి...
నను ఓ దరికి చేర్చవా హర...

మహాదేవ శంభో శరణు.

Friday, February 7, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!
కోరికల ఇటుకలు కాలి
బ్రతుకు పోరాటముల మట్టితో
గూడు కట్టుకుంట,...
కాసింత జాగా ఈయవా కైలాసంలో...
తొలి అడుగు నీవే...
అమ్మ గృహప్రవేశం చేసిపెట్టేలా అర్జీ పెట్టుకున్న
ఎందుకంటే నన్ను
నేను మరచిపోవాలంటే ...
ఏ జన్మలో నైనా ఎప్పుడూ
మహాదేవా నీ ముందు మోకరిల్లాలి.

మహాదేవ శంభో శరణు.

Thursday, February 6, 2025

శివోహం

శివా!నందికి కూడి నడదారి పట్టేవు
నా మోపునీయగ మరి సిద్ధమే
అధివసించగరమ్ము ఆట విడుపుగా
మహేశా . . . . . శరణు .

శివా!లోచనములకు అందవు
ఆలోచనలకు అందేవు
అనుభూతిని పంచేవు
మహేశా . . . . . శరణు .

శివా!నాలో స్పురణగా తెలిసేవు
 నాలో స్మరణగా సాగేవు
సర్వదా శుభమలే కూర్చేవు
మహేశా . . . . . శరణు .

శివా!నాకు శ్రమ లేకుండా మనసెరిగి
వానగా వచ్చి కరుణించేవా ఇలా
అభిషేకాన అలరించేవా భళా
మహేశా . . . . . శరణు


శివా!నిన్ను చూడలేని కంటిని వెలుగైనావు
నిన్ను తెలియలేని దేహాన తేజమైనావు
చిత్రాతి చిత్రాలు అన్నీ నీ సొంతమే
మహేశా . . . . . శరణు .

శివా!నేనుగా పూజ చేసాను
నీవే నేనుగ ధ్యానం చేసాను
శరణమే వరమని అర్ధించాను
మహేశా . . . . . శరణు .

శివా!భస్మరూపాన నీ దేహాన మెరియంగ
దేహాన్ని అర్పించి దేహీ అంటున్నాను
చేరనీకు నన్ను ఆ విధాత చూపు .
మహేశా . . . . . శరణు .

శివా!మాట నీవు ఆట నీవు
పరమెరుగగ బాట నీవు
పూజ తెలిసిన చోటు నీవు
మహేశా . . . . . శరణు.


శివా!పలుకు పరుగుతీసె నిన్ను చూసి
కాలము గుణము మారె కాసుల మెరిసి
తెలుసుకొనగ తేట తెలివి తెలియక విరిసె 
మహేశా . . . . . శరణు .

శివా!ప్రాణదీపమై ప్రభవించేవు
జ్ఞాన జ్యోతిగా తెలిసేవు
ఆ వెలుగున జ్ఞానం పంచేవు
మహేశా . . . . . శరణు .

శివా!ఆశలన్నీ తీర ఆశ నాది
శ్వాసలన్నీ తీర్చు బాస నీది
నిరాశ నను చేర శ్వాస సాగనీకు
మహేశా . . . . . శరణు .

Wednesday, February 5, 2025

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u

శివా!

నీ నామ స్మరణ లో

నీ జ్ఞాపకాల లోకమే నాకు సురక్షిత ప్రదేశం…

ఏదైనా కోల్పోతానేమో అనే భయమూ ఉండదు….

దేనినో పొందాలనే కాంక్షా వేధించదు.

శివ నీ దయ

మహదేవ శంభో శరణు

శివా! పాప పుణ్యాల తాలూకు మూట నా భుజం మీదే ఉంది... నాది నాది నాదే అనుకుని పోగేసుకున్న పాపపుణ్యాలు నాకు తోడుగా ఉన్నాయి నన్ను వదలకుండా... ఆ మూట...