Thursday, April 3, 2025

 శివా!తల్లి వొడిని తెలియ తలచి నీవు

అమ్మ వొడిని చేరి ఆదమరిచేవు

తెలియ యెవరికైనా యిది ముచ్చటే

మహేశా . . . . . శరణు .

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

నీ సేవయే జీవనపరమార్థమాయే

నీ నామమే గానమాయే

నీ ప్రణవనాదమే నా శ్వాసాయే

నీ దివ్య స్వరూపమే నాలో దివ్యతేజమై వెలుగొందే

నీ యందే పరవశమొందే

నీ లోనే లయమాయే

ఇంకేమి కోరను.

శివ నీ దయ. 

Wednesday, April 2, 2025

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

గుప్పెడంత గుండెల్లో....

విశ్వమంత నీ రూపు నింపుకున్న...

మంత్రాలు వల్లించ నే చదవలేదు...

పూజలు చేయనికి నే పూజారిని కాను...

మదిలోన నీ రూపు నింపుకున్నాను మనసారా నిన్నే కొలుస్తూ ఓం నమః శివాయ అనుకుంటు కాలం గడుపుతున్న.


శివ నీ దయ.

Tuesday, April 1, 2025

 శివా!విలాస మెరుగని వాసం నీది

కులాసాలు కూడిన ఖైదు నాది

చెఱ విడిపించు నీ పరమనిపించు.

మహేశా . . . . . శరణు .

 https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u


శివా!

ఏమి మాయజేస్తావో నువ్వు

మహామాయావి నన్ను పరవశింపజేస్తావు 

నీ వశం జేసుకుంటావు మరువనీయవు నిన్ను

మమేకం జేసుకుంటావు నీలో  

అందుకే మహాదేవుడైయ్యావు నీవు.


మహాదేవ శంభో శరణు. 

Monday, March 31, 2025

 శివా!మనసు విప్పి చెప్పలా నా మాట

మనసైన వాడివి నా మనసెరుగవా

ఓ కంట చూడు నా కన్ను విరిసేలా

మహేశా . . . . . శరణు .

 శివా!స్పురణ నను చేరి నిలిచిపోనీ

స్మరణ నను కూడి పదిలమవనీ

కరుణ నీ కనుల వృష్టిగా కురియనీ

మహేశా . . . . . శరణు .

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...