Sunday, July 19, 2020

శివోహం

క్రిష్ణ నీ నామం స్మరిస్తే చాలు నా హృదయ అంతరాళం లో పాలపొంగులా  నీ భక్తి అనురాగాలు ఉబికి వస్తుంటాయి...

నీ సుందర రూపాన్ని దర్శిస్తే ,స్మరిస్తే ,పూజిస్తే భావిస్తే చాలు నా మనసు ఉప్పొంగి ,తనువు పులకించి , హృదయం ద్రవించి ,స్రవించే  ఆనందాశ్రువులు నీ చరణ కమలాలను  అభిషేకిస్తాయి తండ్రి...

శివోహం

తండ్రీ శివప్పా

అవసరం ఉంటే
నీవు ఆది దేవుడవు

అవసరం లేదంటే
నీవు ఆది భిక్షువు

యుగ యుగాలుగా నడుస్తున్న
యదార్థమైన యాదృచ్ఛికం

శివోహం  శివోహం

శివోహం

తెలుసు తండ్రీ

కష్టాలూ నీవే
కన్నీళ్ళూ నీవే
బాధలూ నీవే
భారాలూ నీవే

బంధాలూ నీవే
బాంధవ్యాలూ నీవే
నిర్జీవాలూ నీవే
నిర్యాణాలూ నీవే

శివోహం  శివోహం

శివోహం

శివతత్వం అంటే

తెలియని సత్యం
తెలిసిన ధర్మాన్ని 
ఆచరించమంటుంది 

తెలిసిన ధర్మం
తెలియని సత్యాన్ని 
అన్వేషించమంటుంది 

శివోహం  శివోహం

శివోహం

శివా!అమ్మ నాన్నలు లేని ఆది పురుషా
అత్త మామల ఇంట అమరి నీవు
విశ్వ పాలన చేస్తు మురిసినావు
మహేశా . . . . . శరణు .

శివోహం

భగవంతుని ముందు తలవంచి చేతులు జోడించడమంటే -

చేతులు క్రియాశక్తికి...
తల బుద్ధిశక్తికి ప్రతీక...
బుద్ధి, క్రియాశక్తులను భగవంతునికి అర్పించడమే నమస్కారం

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, July 18, 2020

శివోహం

శివా!అంతటా అన్నిటా అరూపి గాను
గుడిలోని మాకొరకు అరూపరూపి గాను
అమరి వున్నావయ్య అద్భుతంగాను
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...