Monday, August 17, 2020

శివోహం

ఆకలి నియమాలను మాయచేసేస్తుంది...
ఆశలు కోరికల కోటలో గూడు కట్టుకొంటున్నాయి...

ఆ కోరికలే నన్ను నీకు దూరం చేస్తున్నాయి
ఒకటే కోరిక నీ చేరిక వరకూ నన్ను నడిపి
నీపాదాల చెంతకు చేర్చుకో

మహాదేవా శంభో శరణు...

శివోహం

కలుషితమైన దేహంలో
వర్షించే నా కన్నీళ్లు నీకేలనయ్యా
స్వచ్ఛమైన
మా తల్లి గంగమ్మ 
నీ చెంత ఉండగా 

నీ భిక్షను స్వీకరించి
అదే భిక్షను ప్రతి భిక్షగా ఒసగే
నా నైవేద్యాలు నీకేలనయ్యా
అమ్మ జగన్మాత 
అన్నపూర్ణేశ్వరీ దేవి
నీ చెంత ఉండగా 

నేను పూసుకుని
రాసుకుని తిరిగే
విభూదులు నీకేలనయ్యా
అఖండమైన భస్మరాశులు
కోకొల్లలుగా 
నీ చెంత ఉండగా 

శివోహం  శివోహం

శివోహం

" నేను "
 
ఎప్పటికీ 
లోపలకు రాలేనని
తెలుసుకున్నావో ఏమో

" నా కోసం "

ఎంతటి కష్టమైనా భరిస్తూ
బయటే నిరీక్షిస్తున్న
ఏకైక దైవానివి నీవే తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా! నీ గురించి చాటి చెప్పితి
నా గురించి చెవిలో చెప్పితి
నా మాట చెప్ప నీ బంటు నమ్మితి
మహేశా . . . . . శరణు .

శివోహం

నీపైన అపార నమ్మకం తో ఈ సంసార సాగరం ఈదుతూ, నిత్యం నిన్ను ధ్యానించు కొంటూ...

కర్తవ్య నిర్వహణలో తలమునకలై ఉన్న నన్ను మరచి , ఏమార్చి వెళ్ళవు గదా...

తండ్రి!ఆ స్మశానం లో బంధుమిత్రులు వదిలి వెళ్ళాక, నీ సాంగత్యం నాకు దొరుకుతుందనే ఒకే ఒక ఆశతో కాలాన్ని వెళ్ళదీస్తున్నాను!

మహాదేవా శంభో శరణు....

Sunday, August 16, 2020

శివోహం

మంచి మాట మూట ఒకటి మన భుజాలపై ఉండునట...
మన పాపము హరించుకొలదు చిన్నదై దైవానికి దగ్గరగా వెడతాము...
అది ఇరుముడియో...
ఇడుముల ముడియో...
ముడివిప్పి నామడిని శుభ్రము చేయవయా శంకరా...
నను కాయవయా పశుపతీ పరమశివా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నీవంటే మోహం నిను చేర వ్యామోహం
నువు చూడరాక క్రోధం నిను చేరలేక ఉక్రోషం
కలిగించుము మోదం అనుగ్రహించు ఆమోదం
మహేశా ..... శరణు.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...