Thursday, September 17, 2020

శివోహం

ఎలా  ఓర్చుకుంటున్నావు ?
ఆ చితి మంటల వేడి సెగలను ??

మరెలా  భరిస్తున్నావు ?
ఆ కన్నీటి శాపాల  శోకాలను ??

కాస్త ! 
ఇంటి ముఖం పట్టు !!

కైలాసం చేరుకో తండ్రీ !
నీకూ ఒక కుటుంబం ఉందిగా !!

శివోహం  శివోహం

శివోహం

తండ్రీ 
శివప్పా

నీ దర్శన 
భాగ్యమే
రేపటి 
ఉషోదయానికి
శివోదయం

తొలి 
సంధ్యా
కీర్తనల
సమాహారానికి
శుభోదయం

శివోహం  శివోహం

శివోహం

అదృష్టం అంటే 
ఆనందం అంటే 
నీ ఆటలో భాగమై 

ఏ పూటకా పూట
నీ చేతిలో 
ఓడిపోవడమే తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

సకల చరాచర ప్రాణుల
ఉచ్ఛ్వాస నిశ్వాసాలే 
నీకు శృతులుగా 

హృదయ స్పందనల
సంకోచ వ్యాకోచాలే
నీకు లయలుగా 

సాగిపోనీ
నీదైన 
శివ తాండవం తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివప్పా

నీ గురించి
ఏమీ చెప్పలేక పోయినా

ఏదో ఒక
నీదైన భక్తి పారవశ్యం

నీ హృదయాంతరాలకు
ప్రణమిల్లుతూనే ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

జననం నుండి
మరణం వరకూ
నీ అంతరాత్మ అడిగే
ప్రతి ప్రశ్నకూ సమాధానం ?

నీవు మాత్రమే
చెప్పుకోవాలి మిత్రమా
ఆ జననీ జనకులు కూడా
ఇందులో సహాయం చేయరు ??

శివోహం  శివోహం

శివోహం

ఆవిష్కృతం కాలేని 
అంతరంగ అగాధం 
నీ ముందు మవునంగా

అవ్యక్తం కాలేని
ఆవేదనా తరంగం 
నీ ముందు ధ్యానంగా

నీతో ఏదో చెప్పుకోవాలనీ
నీతో మరేదో  పంచుకోవాలనీ
పరి తపిస్తోంది తండ్రీ 

శివోహం  శివోహం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...