Monday, February 22, 2021

శివోహం

నీటిలోన నీవే...
నింగి లోన నీవే...
చెట్టు లోన...
పుట్ట లోన...
నాలోన...
నీ లోనా...
ఇటు చూసినా...
అటు చూసినా...
అంతా నీవే...
అంతటా నీవే
శివా నిన్ను చూసేందుకు ఈ కళ్ళు చాలవుగా...
మహాదేవా శంభో శరణు

శివోహం

నిమిషం, గంటలు, రోజులు,వారం, నెలలు సంవత్సరాలు అతని మనసు కరిగేంత వరకు  ప్రార్థిస్తూనే ఉండు...
అతనొక్కడే నీ గుండె దడ వినేవాడు దాని వెనుక  బాధను తీర్చేవాడు...

ఓం నమః శివాయ

శివోహం

నీ హృదయం కరిగే వరకు...
నా హృదయ స్పందన నీకు వినపడేంతవరకు వరకు...
నిన్ను ప్రార్థిస్తూనే ఉంటా...
నీ చెంత చేరుటకు...

మహాదేవా శంభో శరణు...

Sunday, February 21, 2021

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది పరమేశ్వరా...
నీవే నాకు కొండంత అండగా ఉండి...
నన్ను కాపాడగారావా...
మహాదేవా శంభో శరణు....

శివోహం

జననం నాకు తెలియదు...
మరణం నేనెరుగా...
నడి మధ్యలో నడిచే జీవితం నీ దయ తండ్రి...
మహాదేవా శంభో శరణు..

Saturday, February 20, 2021

శివోహం

ముక్కోటి దేవతల మూలము నీవు.....
ముక్తికి మార్గం నీ నామ స్మరణ...
ఆది అంత్యము నీవే... 
అంతటా నీవే అన్నీవు నీవే...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో!!!నీకూ నాకూ గుప్పెడంత గుండె దూరమే కదా...
నా ఊపిరి దారిలో జ్ఞాన నేత్రంలో దర్శనం ఈయవా ఈశ్వరా....

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...