Wednesday, May 19, 2021

శివోహం

విశ్వమంతా వ్యాపించి ఉన్నావు...
నీవు తప్ప నాకెవ్వరూ కానరావడం లేదు...
అందరూ నీ అధీనంలో ఉండగా....
మరో దైవం మాట నాకెందుకు శంకరా...

మహాదేవా శంభో శరణు...

Tuesday, May 18, 2021

స్వామి శరణం

అయ్యప్ప నామస్మరణం
సకల పాపహరణం...
అయ్యప్ప దర్శనం...
జన్మజన్మల పుణ్యఫలం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

జీవుడు(మనం) ఎప్పటికి ఒంటరివాడే ! 
 జాృగృ,స్వప్నాతావత్సలో వుండేంతవరకే వాడు అఙ్ఞానంతో తోడుకోసం తపిస్తాడు.సుసుక్తావత్సలో వాడి ఉనాకే కోల్పోతాడు అప్పుడు వాడి కళల(కల్పనల) సామ్రాజ్యానికి వాడే కర్త(బ్రహ్మ) కర్మ(విష్ణు)  లయ(రుద్రుడు)
వాడికి అన్యంగా కించిత్ కూడ ఉండదు.ఆవిషయాన్ని జాగృత్ లో ఉన్నప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే  మానవుడు మాధవుడౌతాడు.

ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

గరళమే గొంతు దిగలేదు...
నిందలు గుండెను చేరునా...
నాకు అండగా నీవుండగా...
నన్ను చేరు భయమేది పరమేశ్వరా

మహాదేవా శంభో శరణు...

శివోహం

హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం...
నారదునకు  నారాయణ  నామము నిత్యఔషధం...
నాకు ని నామము నిత్యఔషధం...

మహాదేవా శంభో శరణు...

Monday, May 17, 2021

శివోహం

హనుమంతునకు శ్రీరామ నామము నిత్యఔషధం...
నారదునకు  నారాయణ  నామము నిత్యఔషధం...
నాకు ని నామము నిత్యఔషధం...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ధర్మం అంటే...
అజ్ఞానము అవివేకముతో
అవివేకము అభిమానముతో
అభిమానము క్రోధముతో
క్రోధము కర్మతో
కర్మ జన్మతో
జన్మ దు:ఖముతొ కూడి  యున్నవని
తెలుసుకోవటమే ధర్మం...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...