Thursday, October 14, 2021

శివోహం

శివా!మాంస నేత్రము మూసి ఉంచలేను
జ్ఞాన నేత్రము తెరిచి చూడలేను
మాంస నేత్రము మరపించు జ్ఞాన నేత్రము తెరిపించు
మహేశా. . . . . శరణు.

......

శివోహం

శివ...
నీవెంత దూరంలో ఉన్నా నీ చెంతనే నిలబడి నిన్ను ప్రార్ధిస్తున్నాను.. 
ఎందుకంటే నీవే నాకు పెన్నిధి...
వీడను నీ సన్నిధి...

మహాదేవా శంభో నీవే శరణు.

శివోహం

శివా!తిక్క తలకెక్కగ మేము
తిక్క శంకరుడని నిన్ను అంటున్న వేళ
మా తలతిక్క దిగనీ నిన్ను తెలియనీ
మహేశా . . . . . శరణు .


శివా! "నిన్న" "రేపు" చింత ,నన్ను చుట్టెరా 
ఆ చింతలోనె నేడు అంతా గడిచిపోయెరా
ఆ చింతలన్ని త్రుంచరా, నీ చెంత చేర తెలుపరా
మహేశా ..... శరణు

Wednesday, October 13, 2021

శివోహం

అమ్మ జనని యంత మధురం అమ్మ నీ నామము...
సర్వ శక్తికి ములం 
సర్వ జగత్తుకు ఆధారం 
సర్వ ప్రాణులకు ములం 
స్వర్గ మార్గమునకు ఆధారం నీ నామం...
సర్వ శక్తుల రూపం తో కొలువున్న నినామం
నిత్యము తలచి తలచి పలికెము
అమ్మలు గన్న అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి...

ఓం మాత్రే నమః.

శివోహం

పదములు అల్లగా పండితుడను కాను...
కనులు అర్పించగా కన్నప్పను కాను...
గుడులు కట్టించడానికి రామదాసును కాదు...
పామరుడను శివ పామరుడను...
పెదవుల నీ నామ్మొక్కటే పలకగలను...
నిన్ను పిలుస్తూనే ఉంటా...
పలికితే పరమశివుడవు...
పలకకపోతే మహాదేవుడవు...
నేను మాత్రం నీ పాదం విడవను...

మహాదేవా శంభో శరణు...

Tuesday, October 12, 2021

శివోహం

శివా!తిక్క తలకెక్కగ మేము
తిక్క శంకరుడని నిన్ను అంటున్న వేళ
మా తలతిక్క దిగనీ నిన్ను తెలియనీ
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ
ఏ జన్మలో శాపమో తెలియదు కాని బంధాల వల్ల బాధే కానీ సంతోషం లేదు...

బాధని భహుమతిగా ఇచ్చి ఇప్పుడేం చేస్తావు అన్నట్టు చూస్తుంది విధి...

విధికి నేను భానిస కాలేను ఆ బాధకి అతిథి సత్కారాలు చెయ్యలెను ఆ ఓపికా నాకు లేదు...

శంభో నీవే శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...