Friday, December 31, 2021

శివోహం

నీది కాని నీ తనువుని చూస్తూ...
మురిసిపోతూ తడబడి పోతూ...
తమకపు కన్నుల చప్పుడు చేస్తూ...
తప్పులు చేస్తూ తిప్పలు పడుతావు ఎందుకు జీవా.. మహాదేవుడి పాదాలు పెట్టుకో కలిమయా నుండి తప్పించుకో...

ఓం నమః శివాయ.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.

శివోహం

శంభో...
నా మనస్సు
వాక్కు రెండు వైపుల
కర్మను మధ్యలో ఉంచి నా జీవన త్రిశూలం నీ చేతిలో ఉంచుకున్నావు...
నా ఆలోచనలకు అధిపతివి నీవు...
నా ఆచరణకు అధికారివి నీవు...
నాహృదయానికి ఆత్మీయుడవు నీవు...
నీతో నన్ను నిలుపుకో శివా

మహాదేవా శంభో శరణు.

శివోహం

మంచి ప్రవర్తన నిన్ను అందరి హృదయాలలో నిలిచి పోయేలా చేస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, December 30, 2021

శివోహం

పద్యములు రచించి పఠించగ పండితుడను కాను...
స్వరములు కూర్చి పాటలు పాడగ గాయకుడను కాను...

నీ గురించిన శాస్త్రమును వేదికపై
వివరింప విశ్వ విఖ్యాత నటన నాకు రాదు...

నాకు తెలిసినది ఒకటే ఆర్తిగా నీ వైపు చూస్తూ
శివ శివా యనుచూ నీ నామ స్మరణ చేస్తూ నా గుండెల్లో నిన్ను నింపుకోవడమే..

శివ నీ పాదముల దగ్గర నా హృదయం వుంచి ప్రార్ధించడమే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మనకు కారణం లేకుండా కోపం వస్తుంది కానీ...
కారణం లేకుండా భక్తిరాదు...
కారణం లేకుండా భక్తి ఎవరికి వస్తుందో వారు తరిస్తారు...

ఓం నమః శివాయ.
ఓం శివోహం... సర్వం శివమయం.

Wednesday, December 29, 2021

శివోహం

శంభో...
నీ నామము, నీ రూపం, స్మరణం
ఇవే నా మనసుకు పరిచయం...
నిత్యం నీరూపదర్శనంతో నీ నామ స్మరణమే దినచర్య...
ఇక నీవే కరుణించి ఏదో సమయంలో నీవొకసారి దర్శనం ఈయగరావా రావా శివ.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
నా బుధ్ధి అంతా నీ మీదే ఉంచు...
గంగ ఎంత వేగంగా తిరిగినా చివరకి సముద్రం వైపునకు ప్రవహించురీతిన, నా బుధ్ధి ఎంత చంచలంగా ఉన్నా ఇతరముల వైపునకు మరలక,
నిన్నే కలిసేటట్లు నీయందే ఉండాలా అనుగ్రహించు...

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...