Monday, March 14, 2022

శివోహం

శివా!దేహంపై మాకు వ్యామోహం 
దానికి మేము  దాసోహం
"దా" తొలగించు "సోహం"నెరిగించు
మహేశా . . . . . శరణు.

శివోహం

నేను కోరకుండానే నువ్వు నాకిచ్చిన నిరాడంబరమైన గొప్ప వరాలు: ఆకాశమూ, కాంతీ, నా ఈ దేహమూ, జీవితమూ, మనస్సు

వీటికి నన్ను అర్హుణ్ణి చేసి 
అత్యాశలవల్ల కలిగే ఆపదలనించి రక్షిస్తున్నావు

నా జయాపజయాలనించి బహుమానంగా 
నేను సంపాయించిన హారాలతో 
నిన్ను అలంకరిస్తాను దేవా...

మహాదేవా శంభో శరణు...

Sunday, March 13, 2022

శివోహం

ఈ ప్రకృతి అంతా ఈశ్వరుడే...
ఈ సృష్టి అంతా ఈశ్వరుడే...
ఈ సృష్టి అంతా సద్గురు...
ఓం శివోహం...సర్వం శివమయం.

శివోహం

శివా!వెన్నులో ఏదో వేడి పుట్టింది 
ఆ వేడి ఎగబ్రాకి వెలుగయ్యింది
ఆ వెలుగు నీవని తెలియ వచ్చింది. 
మహేశా..... శరణు

Saturday, March 12, 2022

శివోహం

శివా!కోరి నేనడిగిన కోరికగును
తెలిసి నీవొసగిన వరమగను
వరమీయవయ్యా వరదాతా
మహేశా . . . . . శరణు .

శివోహం

హరిహార పుత్ర అయ్యప్ప...
అజ్ఞానమనే చీకటికి...
నీనామము చిరుదీపముగ వెలిగించి...
నీరూపము కొరకు వెదుకుచుండగ...
దారితప్పిన వేళ చేయూతనిచ్చి నీవైపు నడిపించు...
ఎంత చీకటిలోనైనా(కష్టంలో)నిన్ను వదలను...
మణికంఠ దేవా నీవే నా దీపానివి...
నా ఆరాధనయే నీకు దీపారాధన...

మహాదేవా శంభో శరణు...
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

సృష్ఠి  ఆవిర్బావము.
1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17. పృథ్వీ యందు ఓషధులు
18. ఓషదుల వలన అన్నం
19. ఈ అన్నము వల్ల నర మృగ  పశు  పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...