Wednesday, December 13, 2023

శివోహం

నీ చరణ దర్శనం మా ముక్తి మార్గం
నీ పాద ధూలీ మా నుదిటి విభూతి
నీ అభయహస్తం మాకు ప్రసాదించే అభయం
నీ పంచాక్షరీ మంత్రం తో పరవసించే సమస్త విశ్వం
నీ నామా స్మరణే సర్వపాప హరనం
హర ఈ మాయ నుండి విడిపించి మొక్ష మార్గం వైపు నడిపించు
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!కొండైనా కాడైనా అది నీ ఇల్లే
ఏ వాడైనా ఏనాడైనా తొల్లింటి వాడవు నీవే
చేయి క్రిందున్నా పైనున్నా  ప్రదాతవు నీవే
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రతిరోజు వేదనతో వణుకుతూ
ముచ్చెమటలు పడుతున్న ఈ గుండెను 
పసిబిడ్డ లా జోకొట్టి శాశ్వత నిద్రపుచ్చు..
శివ నీ దయ.

శివోహం

తొలివలపు రోదన సరే కానీ చివరి రోదనలా వినిపిస్తుంది ఏంటో నా మది కి.
అపశకునమవుతూ నా మనసు ముంగిట్లో.

శివ నీ దయ.

Monday, December 11, 2023

శివోహం

శివా!కార్యము తీరగ  భారము మోసావు
భారము తెలిసి భావము పంచేవు
ముక్తిని వొసగగ బంధములు త్రెంచవా
మహేశా . . . . . శరణు .

Sunday, December 10, 2023

శివోహం

శివా ! నీ కోసం అడుగేస్తే
నా కోసం గుడి కట్టేశావు
నీ మది గూడులో నను నిలబెట్టేశావు
శివా ! నీ దయ

శివోహం

అబద్దం
అంతా అబద్దం
బందాలు  అబద్దం
నీ చుట్టూ బంధుత్వాలు అబద్ధం
తరిగిపోయే వయసు అబద్దం
కరిగిపోయే అందం అబద్దం
నువ్వు అబద్దం
నీ తనువు అబద్దం
నీ బ్రతుకే పెద్ద అబద్దం
శివుడే నిజం
శివుడొక్కడే నిజం.
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...