Monday, March 18, 2024

శివోహం

బ్రతుకు ఎంత భారమైన

భరోస నిచ్చే అండ నివని

నా మనసు గుడి కాకా నీ ఒడి కోరుతుంది
మహాదేవా శంభో శరణు.

శివ నీ దయ

శివోహం

గుండె గుప్పెడైనా
నాలుగు గదుల విశాల హృదయ
ప్రదేశమది
మదినిండా నీవు నిండివుండగా
జీవన, తపన, ధ్యాన, ధ్యాస లను నాలుగు గదుల నింపి
నీకు అంకితం ఇస్తున్నా
నానోట ఓం నమఃశివాయ ను పలికించు చాలు
సదా నీ స్మరణతో....
మహాదేవా శంభో శరణు.

Sunday, March 17, 2024

శివోహం

సంపద లెరుగను సొంపైన 
నీ నామంబుతప్ప....

ధనమును కాంచను ఘనమైన 
నీ రూపంబు తప్ప....

భవనములు ఎరుగను భవ్యమైన 
నీ చరణారవిందములు తప్ప....

కనకపురాసులు ఎరుగను కోమలమైన 
నీ కృపా కటాక్ష వీక్షణములు తప్ప....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

అలసిపోయిన బ్రతుకుకు
బతకగలను అని నువ్వే ఇవ్వాలి తండ్రి.
ప్రశ్న గా మారిన జీవితానికి సమాధానం నీవే ఇవ్వాలి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

పరిస్థితులు ఎప్పటికి ఒకేలా ఉండడానికి అవేమి అస్తిపాస్తులు కావు...
కానీ అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే తల్లి.

అమ్మ మాయమ్మ దుర్గమ్మ శరణు

Saturday, March 16, 2024

శివోహం

శివ!
నిర్మలమైన రూపం నీది...
ప్రకృతినే నీయందు నిలుపుకున్నావు...
సుందర రూపుడవు నీవు...
భౌతికంగా నీచిత్రం ఇంత అందంగా ఉంది...
మరి అంతరంగాన నీదర్శనమెప్పుడిస్తావు....
నిజ దర్శన భాగ్యం కలిగే రోజు కోసం చకోరా పక్షి లా ఎదురు చూస్తున్న.
అత్యాశ అనుకోకు తండ్రి ఆశీర్వదించు..
మహాదేవా శంభో శరణు.


శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...