Tuesday, June 30, 2020

శివోహం

లోకాల పాలన చేయగ ...
విశాఖ పురమున వెలసిన ...

శ్రీ కనక మహాలక్ష్మీ ...

చినుకుల చిటపటల వలే   నీ చల్లని చూపు ...

నల్లని మబ్బుల చక్కటి వర్షపు ధారల ..
నిండార కురిసేడి  నిరపేక్షగ  నీ దయ ...

ఎక్కడ...ఎవరికి ఎలా  కురిపిస్తావో ...?
చిత్రమైనది నీ కటాక్షం ...

కావాలన్నవాడికి  పడనివ్వు  నీ జడి  ...
వొద్దన్నవాళ్ళకి  పడకుండా ఆగవు ...

తోడుగనీడగ  నాబిడ్డలుండగ ...
నాకు నీడెందుకనుచూ ...
తాటియాకుల పందిరి మాత్రమే 
వేయించుకున్న నీ ఘనతను 
ఏవిధముగానూ నేను  వర్ణించలేను తల్లీ ...
నిన్ను శరణుజొచ్చెడు భక్తులము మేము  ...

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...