Friday, July 31, 2020

శివోహం

శివా!ఎదలోనేవున్నా  ఎడముగానే ఉన్నావు
కంటి వెలుగు నీవైనా కనిపించకున్నావు
శ్వాసగా నీవు తిరుగుతున్నా ఆశ తీర్చకున్నావు
మహేశా ...... శరణు.

శివోహం

ఏమి లేకుండా వచ్చి
ఏమి తీసుకెళ్ళకుండా వెళ్ళటమే జీవితం...

ఏదో ఉందని భ్రమించి
ఏమి లేదని తెలుసుకోవడమే ప్రేమ...

నిజమైన ప్రేమ భగవంతుడి సన్నిధిలోనే దొరుకుతుంది....

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, July 30, 2020

శివోహం

అమ్మ-నాన్నలు...
విశ్వమే వారు.. 
విశ్వమంతటా ఉభయులు
అందరికీ అభయములీయగ
అణువణువున వెలసినారు
ఓం నమఃశివాయ...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

రావాలనే ఉంది....
పుట్టెడు బాధలు వదిలి...
మరిచిపోలేని బంధాన్ని వదిలి....
నీ చెంత చేరాలని ఉంది...
నిన్ను చూడాలని ఉంది ....
నా కంటి వెలుగులా....
నీలో కలసిపోవాలని ఉంది...

మహాదేవా శంభో శరణు...

శివోహం

తండ్రీ శివప్పా
నీ రుద్ర భూమే

చివరి  
విడిది వసతి నాకు 

ఆఖరి 
విరి పానుపు పవళింపు నాకు

శివోహం  శివోహం

శివోహం

శివా!కర్మ బంధం జన్మలు కడతేరనివ్వదు
జ్ఞానంతో బంధం జన్మను దరి చేరనివ్వదు
జన్మ నెడబాటు చేయు జ్ఞానమీయి .
మహేశా . . . . . శరణు .

శివోహం

అశాశ్వతమైనది శాశ్వతముగా...

శాశ్వతమైనది అశాశ్వతముగా...

భ్రమింప చేసేది *మాయ*...

ఆ మాయ తొలిగిన నాడు...
నీవు నేను అనే బేధము తొలిగి...

ఆత్మ పరమాత్మ లో లీనం అవుతుంది....

ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, July 29, 2020

శివోహం

పంచభూతాలు తానే అయిన పంచభూతేశ్వరుడు
సర్వజీవులకు దేహాలు ఇచ్చి తండ్రి అయ్యాడు

శాస్త్రాలను అందించి ఆప్తమిత్రుడు అయ్యాడు
సర్వసృష్టిని తన అధీనంలో ఉంచున్నందుకు 
సర్వేశ్వరుడు అయ్యాడు

సర్వ జీవుల ఇహ పర శ్రేయస్సు కొరకు తనకు
తానుగా అవతరించాడు గనుక లోకానికి
జగద్గురువు అయ్యాడు

ఓం నమః శివాయ.......

శివోహం

శివా!నీ చరణ కమలాలు
కరుణించు నేత్రాలు
స్మరింతే చాలు తొలగేను శోకాలు
మహేశా . . . . . శరణు .

శివోహం

రావాలనే ఉంది....
పుట్టెడు బాధలు వదిలి...
మరిచిపోలేని బంధాన్ని వదిలి....
నీ చెంత చేరాలని ఉంది...
నిన్ను చూడాలని ఉంది ....
నా కంటి వెలుగులా....

మహాదేవా శంభో శరణు...

Tuesday, July 28, 2020

శివోహం

నీ వైరాగ్యం 
నిరంతరం

నన్ను 
శుద్ధి చేస్తూ 

నిన్ను 
చూపిస్తూ ఉంటుంది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ఎంతగా 
మాయ చేస్తావంటే తండ్రీ 

అసలు సిసలైన 
నీ ప్రయాణానికి 

ఏ ఒక్కరూ
ఆలోచన చేయలేనంతగా

శివోహం  శివోహం

శివోహం

నీవు 
అశక్తుడైన వేళ

ముక్కోటి దేవతలూ 
నీకు దర్శనం ఇస్తారు

మేలుకో మిత్రమా 
ఏదో ఒకటి సాధించుకో  నేస్తమా

శివోహం  శివోహం

శివోహం

మంచి మాటమూట ఒకటి మన భుజాలపై ఉండునట...
మన పాపము హరించుకొలదు చిన్నదై దైవానికి దగ్గరగా వెడతాము...
అది ఇరుముడియో ఇడుముల ముడియో
ముడివిప్పి నామడిని శుభ్రము చేయవయా శంకరా...
నను కాయవయా పశుపతీ పరమశివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అగ్నియు నీవే....
సమిధయు నీవే....
ఆహుతియు నీవే....
భక్తకోటిని కాచే నా ప్రాణనాధుడివి నీవే...
నా ప్రాణం ధాతవు నీవే.....

మహాదేవా శంభో శరణు...

శివోహం

హరుడా బ్రతుకు నాటకమునకు భరతవాక్యము పలక సమయమాసన్నమయినట్లుంది...

నీఆనతి కొరకు ఆత్మ వేయి జ్ఞాననేత్రముల ఎదురుచూస్తూన్నది...

జననమరణముల నడుమ సాగిన నటన మిగిల్చినదేమో లెక్కతేలకుంది....

నీ ఆటవిడుపుకై నన్నాడించిన ఆటల ఆంతర్యము భోధపడకుంది...

మహాదేవా శంభో శరణు...

శ్రీరామ

రాముడే దేముడు దేముడే రాముడు
నీలమేఘశ్యాముడునిజముగవున్నడు
ఆనాడు వేడెను హనుమంతుడూ
సీతారామా రామా యని విలపించేనూ
కాళిదాసైననూ భక్తశభరైననూ
ఈ దరలోన ననుబ్రోచు దొరఆతడూ

Monday, July 27, 2020

శివోహం

పరమ పవిత్ర 
ప్రదోష కాల 

అప్రతిహత 
నీ జైత్ర యాత్రకు 

జయ మంగళం 
నిత్య శుభ మంగళం తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

నా కన్నా 
నీకే కోరికలు ఎక్కువ తండ్రీ 

నాతో 
అభిషేకాలు చేయించుకోవాలనీ
నాతో
రుద్రం చదివించుకోవాలనీ

నీ దర్శన భాగ్యం 
మనస్ఫూర్తిగా ఇవ్వాలనీ
నాకు నేనుగా 
నీ వద్దకు తరలి రావాలనీ

శివోహం  శివోహం

శివోహం

శంభో..
నీవు కైలాసములో కనక మణి సౌధములో....

ప్రమథ గణములతో సేవింపబడు చుండగా...

నీ ముందు జేరి నా కరముతో నిన్ను సేవించి నీ నామజపం చేస్తూ నిన్ను సేవించి తరించి భాగ్యం నాకు ఎప్పుడు కల్గుతుందో...

నా మనస్సు నీ నామస్మరణ తోనే పులకించి పోతోంది దేవా ఇక నీ దయ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఈశ్వరభక్తి
సర్వభూతేషు కారుణ్యం ప్రియభాషణమేవ చ /
సర్వభూతహితే శ్రద్ధా సాక్షాద్భక్తి: శివస్య తు //

సమస్తభూతములయందు కారుణ్యభావమును, అందరితో ప్రియముగా మాట్లాడుటయు, సకలప్రాణుల సౌఖ్యంకొరకు పాటుపడుటయు, సమస్తప్రాణుల యందు ప్రకాశించుచుండువాడు భగవంతుడేయని గ్రహించుటయుయే నిజమైన ఈశ్వరభక్తి. 

*భారతి గారు*

Sunday, July 26, 2020

శివోహం

శివా!జ్ఞాపకాల జాడ జారిపోనీ , 
నేను కాని నాదులు రాలిపోనీ, 
సత్యమైన నేను ఎఱుకరానీ
మహేశా ..... శరణు

శివోహం

శివా!జ్ఞాపకాల జాడ జారిపోనీ , 
నేను కాని నాదులు రాలిపోనీ, 
సత్యమైన నేను ఎఱుకరానీ
మహేశా ..... శరణు

Saturday, July 25, 2020

శివోహం

ఆరడుగుల
నేల కూడా 
నాది కాని
నాలాంటి ఆసామితో

అండ
బ్రహ్మాండ నాయకుడు
ఆది దేవుని 
అంతర్యుద్ధం

గెలుస్తావని
నీ నమ్మకం
గెలిపిస్తావని 
నా నమ్మకం తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

తండ్రి శివప్ప
సేవా కైంకర్యం

శిరోభారం కూడదు
శిరోధార్యం కావాలి

శివోహం  శివోహం

శివోహం

వ్యాకరణాలూ తెలియవు
అందులోని గణవిభజన 
రణాలూ తెలియవు

తెలిసింది ఒక్కటే

చిన్న చిన్న పదాలతో
అలతి వేసినట్టుగా
కొలత కైలాసం చేరుకునేట్టుగా

చేస్తున్న  చిన్ని ప్రయత్నానికి
నీ ఆశీర్వాద ప్రసన్న
ప్రమోదం ప్రసాదించు తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

ప్రభూ.....
కన్నీటితో  నీ పాదాలు
కడగాలనుకున్నాను
కానీ...కలతలతో
కన్నీళ్ళు  కలుషితమయ్యాయి

మనసుతో నిన్ను
అర్చించాలనుకున్నాను
కానీ...మమతలని
మరచిన మనసు
మూగబోయింది

హృదయంలో నిన్ను 
నిలుపుకోవాలనుకున్నా
కానీ...అనుభందాల
జడివానలో ఆ హృదయం
ఎక్కడో కొట్టుకుపోయింది

హృదయం లేని నేను
నిర్జీవమై ....
సంచరించే ఒంటరి ఛరినయ్యాను 
అనంతానంతాలు కూడా
నీ అదిపత్యం లో 
అలవోకమవుతున్నయి
నేనల్పమని చెప్పటానికి కూడా
అర్హతలేనిదాన....
కానీ...
నాకోసం నీవున్నావనే
ఓ నమ్మకం ఏమూలో దాక్కోని
నీ ముందు ప్రణమిల్ల జేస్తుంది
ప్రభూ...!
నీ చరణాలు విడువక .....
సేద తీరుతా ఆ చల్లని స్పర్సల...
ఆత్మ హారతుల మంగళ గీతాలలో..ప్రభూ...!!

శరణం

ఎంత భాగ్యము స్వామి 
నీ ఇరుముడిని నే మోయగా
నా బ్రతుకెంత ధన్యము స్వామి 
ఎంత పుణ్యము స్వామి నోరార నీ భజనము సేయగా
ఎంతెంత పుణ్యం స్వామి.........

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప....

శివోహం

శివా! నిన్నటి తలపు రానీయకు
రేపటి చింతన కలుగనీయకు
నేడు నీ జపము ఆగనీయకు
మహెశా . . . . . శరణు .

శివోహం

గమ్యం తెలుసు 
గడువు తక్కువనీ తెలుసు 
పిలుపు తెలుసు
పొద్దు పొడుస్తుందనీ తెలుసు 

అయినా 

ఏదో తెలియని ఆనందం
ప్రాణ ప్రియ మహా దేవుడు 
కనిపిస్తాడనీ 
కనువిందు చేస్తాడనీ 

శివోహం  శివోహం

హరే

పాల కడలిని పర్వతాలను చేరి
ప్రభవించినావయ్యా పరమపురుషా

నమో వేంకటేశా..నమో శ్రీనివాస

ఏడేడు లోకాల ఏలికనైన నీవు
ఏడు కొండల చేరి వెలసినావు
కేశాశ్రితమైన కోటి పాపాలు
తొలగించ కోరేవు తల నీలాలు

గోవింద నామాన పట్టాభిషేకం
పలుమార్లు జరిగేను పిలిచి పిలిచి
నీకెంత ప్రయమో మాకంత ఘనము
మనాన మాకు మధురాతి మధురం

కామ్యాలు తీరినా కష్టాలు కలిగినా
శ్రమలోన అలసినా విశ్రాంతి దొరికినా
మురిపెంగ మేము మనసార పలికేదీ
గోవింద నామమే  హరి గోవిందా

గోవింద గోవింద భజ గోవింద
గోవింద గోవింద హరి గోవింద......2

శివోహం

విశ్వానికి నీవే జీవమై జీవిస్తున్నావు...
జగతికి నీవే తేజమై వెలుగుతున్నావు...
సృష్టికి నీవే సూర్యుడై ప్రకాశిస్తున్నావు...
నీవే సర్వం.... నీవే సకలం

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా! విష్ణు చిత్తములోన వెలసినావు
విశ్వ పాలన ఏమొ తెలిపినావు
విశ్వనాథునిగ మరి తెలిసినావు
మహేశా ..... శరణు.

హరే

పాల కడలిని పర్వతాలను చేరి
ప్రభవించినావయ్యా పరమపురుషా

నమో వేంకటేశా..నమో శ్రీనివాస

ఏడేడు లోకాల ఏలికనైన నీవు
ఏడు కొండల చేరి వెలసినావు
కేశాశ్రితమైన కోటి పాపాలు
తొలగించ కోరేవు తల నీలాలు

గోవింద నామాన పట్టాభిషేకం
పలుమార్లు జరిగేను పిలిచి పిలిచి
నీకెంత ప్రయమో మాకంత ఘనము
మనాన మాకు మధురాతి మధురం

కామ్యాలు తీరినా కష్టాలు కలిగినా
శ్రమలోన అలసినా విశ్రాంతి దొరికినా
మురిపెంగ మేము మనసార పలికేదీ
గోవింద నామమే  హరి గోవిందా

గోవింద గోవింద భజ గోవింద
గోవింద గోవింద హరి గోవింద......2

Friday, July 24, 2020

శివోహం

నా నమ్మకమూ శివుడే...

నమక(నమస్కారం) పారాయణ చేయకుండా...

చమకముల(కోరికల) చేయుచుంటినని
కనుమరుగయ్యావా తండ్రి...

నవరంధ్రాల ఈ తోలుతిత్తిని నవగ్రహాలకు
వదిలేసి విడ్డూరం చూస్తున్నావా పరమేశ్వర...

నాకు నీవున్నావనే నమ్మకంతోనే ఇదంతా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నిన్ను తలవనిది నాకు పొద్దుపోదేమి.....
ఎంత తలిచిన విసుగు పుట్టదేమి తండ్రి....

మహాదేవా శంభో శరణు...

Thursday, July 23, 2020

రాదేకృష్ణ

ఎంత మాయ లోడివి రా కృష్ణ ..
నీ ప్రేమలోపడగొట్టి...
మమ్ము నీ చుట్టూ తిప్పేవు...
ఎంత గడుసు వాడ వు రా కృష్ణ...
నన్ను పట్టుటకు ఆ మురళి తో పట్టి పిలిచేవు...
ఎన్ని మాటలు నేర్చావురా కృష్ణ...
ఆ మాటలకు నా మనసు కరిగి...
నీముంగిట  వాలను....

రాదేకృష్ణ రాధేశ్యాం...
రాధే రాధే...

శివోహం

నీవు నాకు ఎన్ని జన్మలిచ్చినా నేను పలికేది ప్రణవమే...
నాకు ఏ రూపమిచ్చినా వినిపించేదీ ప్రణవమే...
పశువునైనా పక్షినైనా ఇతరమైనా అణువణువూ నీ సన్నిధియే కదా...
ఏమరపాటుగా నన్ను జన్మలనుండి వదిలేసినా
నేనుండేది నీగుండె గూటిలోనే తండ్రి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

మాయ జలమున మునిగేవు నరుడా
దారి తెలియక తడబాటు ఎలారా 
జ్ఞాన నేత్రమున వెదికి చూడవే మనసా 
శాశ్వత జ్యోతిని కనుగొనవే మనసా 

ఓం శివోహం...సర్వం శివమయం

Wednesday, July 22, 2020

శివోహం

నా మనసును మానస సరోవరం చేసి
నాలోనే కైలాసం నిలిపి...
నా గుండెలలో గూడు కట్టుకుని నిలిచాను...
నాలోకి నేను పయనించు దారితెలియక దిక్కులు తిరిగుతున్నాను...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివోహం

శివా!నామ రూప రహితమైన నిన్ను తెలియగ
నాకు మనసైన  నామముతో తెలుసుకొమ్మనీ
శత సహస్ర నామాలాకు రూపమిస్తివా
మహేశా. . . . . శరణు .

శివోహం

భక్తిప్రపత్తులు.. ఆధ్యాత్మిక పరిభాషలో ఎక్కువగా వినిపించే పదబంధం ఇది. భక్తి.. ప్రపత్తి.. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. అయితే, ఈ రెండూ భగవదనుగ్రహాన్ని పొందడానికి, మోక్షసాధనకు గల భిన్నమైన మార్గాలు. ‘భక్తి’ గురించి మనందరికీ తెలిసిందే. దైవాన్ని ఆరాధించడం, ప్రేమించడం, పూజించడం, ప్రార్థించడం, వేడుకోవడం, భగవన్నామస్మరణ చేయడం.. ఇలా ఎన్నో రకాలుగా మన భక్తిని చాటుకుంటాం. జనసామాన్యమంతటికీ అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక సాధన ఇదే. కానీ భక్తి చాలామందికి తాత్కాలిక అంశం మాత్రమే. భక్తి నేతి ధారవలె నిరంతరం కొనసాగుతుండాలని భగవాన్‌ రమణులు చెప్పారు. ఆపత్కాల భక్తి వల్ల అంత ప్రయోజనం ఉండదు. అలాగని సాధారణ ప్రజకు నిరంతరం భగవన్నామ స్మరణలో మునిగి ఉండడమూ సాధ్యం కాదు. పైగా భక్తిమార్గం నుంచి మనను పక్కకు తప్పించడానికి ‘మాయ’కు ప్రతిరూప మైన మనస్సు ఉండనే ఉంది. మనం సరైన దారిలో నడవకుండా చేయడమే దాని పని. అది సదా ఈ శరీరమే ‘నేను’ అనుకోవడం, దేహపోషణకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడమనే దేహాభిమానాన్ని పెంచిపోషిస్తుంటుంది. వాస్తవానికి ‘నేను’ అంటే కనిపించే ఈ ‘దేహం’ కాదు. ‘ఇది నా కాలు.. ఇది నా చెయ్యి.. ఇది నా కడుపు.. నా గుండె.. నా తల’ అంటుంటాం. అలా మనం అనుకొనే ఆ ‘ఇది’ అంటే ఏమిటి? అని ఆలోచిస్తే అర్థం అవుతుంది. ‘నేను’అంటే ఆత్మ. మనందరం ఆత్మస్వరూపులమే. ఈ శరీరాన్ని చైతన్యవంతంగా ఉంచుతున్న చలనశక్తే అసలైన మనం. అదే ఆత్మచైతన్యం. ఆ విషయాన్ని అర్థం చేసుకుని గట్టిగా పట్టుకోవాలి. ఇది భక్తుడి బాధ్యతే. భగవంతుడి పనికాదు. అందుకే ఈ విధానాన్ని ‘మర్కట కిశోర న్యాయం’ అంటారు. భక్తిమార్గంలో సాధకుడు కూడా ఇలాగే ఎన్ని కష్టాలెదురైనా భగవంతుణ్ని పట్టుకునే ఉండాలి. ప్రహ్లాదుడు ఇందుకు ఉదాహరణ.

ఇక ప్రపత్తి.. భక్తి కంటే ఉన్నతమైనది. భారమంతా భగవంతునిపై వేసి సంపూర్ణ శరణాగతి వేడే విధానాన్నే ప్రపత్తి అంటారు. అది ‘మర్కట కిశోర న్యాయం’ వలె కాక.. ‘మార్జాల కిశోర న్యాయం’ వలె ఉంటుంది. మార్జాలం అంటే పిల్లి. అది ఒక ఇంట్లో మరుగు చూసుకుని పిల్లలను కంటుంది. కానీ, ఆ కూనలను పెద్దయ్యేవరకూ ఒకేచోట ఉంచదు. చాలాచోట్లకు తిప్పుతుంటుంది. వాటిని జాగ్రత్తగా తన నోట కరుచుకుని తీసుకెళ్తుంది. పిల్లికూనలు కోతిపిల్లల్లాగా కాక.. పూర్తిగా తల్లిపైనే ఆధారపడి ఉంటాయి. ప్రపత్తి మార్గం ఈ కోవలోనిదే. ‘నీట ముంచినా.. పాల ముంచినా నీవే స్వామి.. మంచిజరిగినా, చెడు జరిగినా నీవే దిక్కు’ అంటూ సాగిలపడే పద్ధతి ఇది. ఈ పద్ధతిలో పరమాత్మను కొలిచేవారు తమ గురించి తాము పట్టించుకోరు. తమ అవసరాల గురించి పట్టించుకోరు. దీంతో దేవుడే వారి భారం వహిస్తాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. అరుణాచలేశ్వరుణ్ని నమ్మి ఇల్లు వీడిన భగవాన్‌ రమణుల వంటివారు ఇందుకు ఉదాహరణ.

శివోహం

శివా! భిక్షమడుగ నిన్ను బయలుదేరెను
రక్ష నొసగగ నిన్ను రమ్మన్నాను
నీ కరుణ కాస్త  నాయందు చూపమన్నాను .
మహేశా ..... శరణు..

శివోహం

ఆత్మ అనే పదం జీవునికి, దేవునికీ వర్తిస్తుంది. జీవుడు జీవాత్మ అయితే.. దేవుడు పరమత్మ. దేహమునందున్నవాడు జీవుడు. శరీరంలో జీవుడున్నంతవరకూ శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. శరీరాన్ని ధరించిన జీవుడే దాన్ని నడిపిస్తాడు. జీవుడు స్థూల శరీరాన్ని వదలి వెళ్తుండగా.. అతని సూక్ష్మశరీరంలో భాగమైన పంచప్రాణాలు, మనసుతోపాటు ఇంద్రియాలు అతడి వెంట పరుగులు తీస్తాయి. ఇలా శరీరంలో చైతన్యం జీవాత్మ అయితే.. విశ్వమంతటా నిండి ఉన్న చైతన్యం పరమాత్మ. అన్ని లోకాలయందూ వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ తత్వం. అదే బ్రహ్మం. జీవాత్మకంటే సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మము వేరే లేనే లేదు. అది వ్యాపకతత్వం. శరీరంలో జీవాత్మతో పాటు పరమాత్మ ఉన్నా.. రెండూ భిన్నమైన తత్వాలు. నిత్యమైనవి, సత్యమైనవి. జీవాత్మ, పరమాత్మ తత్వం కాకుండా ఈ జగత్తులో మనకు కనిపించే పదార్థమంతా జడం. ఇది మార్పు చెందుతుంది. లయమౌతుంది. పరమేశ్వరునిచే ప్రళయకాలం తదుపరి మరల సృష్టించబడుతుంది.
 
ప్రకృతి అంతా జడపదార్థం. పరమాణువుల సముదాయం. ప్రాణం లేనిది. ప్రాణం లేనప్పుడు చర్యలు జరగవు. శరీరం నుండి చైతన్య స్వరూపమైన ఆత్మ వెళ్లిన తర్వాత శరీరం క్రియాహీనమవుతుంది. ప్రకృతి రూపాన్ని ధరిస్తుంది. అంతటా వ్యాపించి ఉన్న అచలుడైన పరమేశ్వరుడే.. శరీరం అనే జడప్రకృతికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. జీవాత్మ, పరమాత్మల చైతన్యం కంటికి కనిపించదు. ఎందుకంటే చైతన్యం రూపం కాదు. అన్ని వస్తువులయందు, రూపాలయందు వ్యాపించియుండి వాటిచేత క్రియలు జరిపించేది ఆ బ్రహ్మ తత్వమే. గ్రహసంచారం, సూర్యోదయ, సూర్యాస్తమయాలు, కాలములు ఏర్పడటం వంటి క్రియలన్నీ జరగడానికి హేతువు పరమాత్మ. అన్ని భూతముల యందూ తాను చైతన్యమై, ప్రాణమై వెలుగొందుట వల్లనే ప్రపంచంలో చర్యలన్నీ జరుగుతున్నాయి. వెలుగునిచ్చే వస్తువులన్నీ పరమాత్మ చైతన్యంతోనే వెలుగులీనుతున్నాయి.
 
‘తస్యభాసా సర్వమిదం విభూతి’
 
అని ముండకోపనిషత్తు చెబుతుంది. ‘అతని ప్రకాశం చేతనే ఈ ప్రపంచమంతా వెలుగుతుంది’ అని దీని అర్థం. సూర్యుడుగానీ., చంద్రుడుగానీ, చుక్కలుగానీ.. సమస్త ప్రపంచం పరమాత్మ ప్రకాశంలోనే వెలిగిపోతుందన్న ఉపనిషత్తు వాక్యం మనకు శిరోధార్యం.

శివా

శంభో...
నాజీవిత లోలక కంపన పరిమితిని స్థిరపరచి...
ఊపిరి ఊయలలో నీ నామం స్మరించేలా చేయవా...
పాడు మనసు ఒకే చోట నిలవడం లేదయ్యా...
మహాదేవా శంభో శరణు...

Tuesday, July 21, 2020

శివోహం

నీకు వినబడే అంత గట్టిగా స్మరించలేను...
కానీ మౌనంగానే మాట్లాడతాను...
నా మనసులో ఉండి అంతా విను
వరం ఇచ్చినా ఇవ్వకపోయినా
నీతో చెప్పి ఉంచితే సమయం వచ్చినప్పుడు నీవే రక్షిస్తావు కదా

మహాదేవా శంభో శరణు...

శివోహం

ధర్మమూ
అధర్మమూ
సత్యమూ
అసత్యమూ

న్యాయమూ
అన్యాయమూ
సంస్కారమూ
కు సంస్కారమూ

వీటిని అర్థం చేసుకోలేక
తాత్పర్యాన్ని అన్వయించుకోలేక
యుగ యుగాలే
అంతరించిపోయినాయి తండ్రీ

శివోహం  శివోహం

Monday, July 20, 2020

శివోహం

ఏ జన్మ పాపాలో కానీ...
ప్రారబ్ద ఖర్మలై పీడిస్తాయి...
కలవరిస్తే చాలు కైలాసం దిగి వచ్చి
కాపాడతాడుతవట కదా...

నీ దయా తండ్రి....

శివోహం

ముక్కంటి దేవుడతడు
ముల్లోకాలు ఏలునతడు

కరుణించి కాపాడు వాడు
వాడు అందరికీ దేవుడైన వాడు

రచన నాదే కావచ్చు
దర్శకుడు మాత్రం శివుడే

శివోహం  శివోహం

Sunday, July 19, 2020

శివోహం

అర్ధనారీశ్వర స్వరూపం
రేయిపగల సమ్మేళనం
సుఖదుఃఖాల సహచర్యం
నమో నమో దేవా నీకే మది అంకితం!

ఓం అర్ధనారీశ్వరాయ నమః

శివ కేశవ

ఆట కదరా శివ... ఆట కద కేశవ

జనన మరణముల జగతి... ఆట కదరా శివ
నట్టనడుమ ఈ బ్రతుకు... ఆట కద కేశవ

కాసు కొరకు పరుగు... ఆట కదరా శివ
కడకు మిగిలేది కాటి బూడిదే  కద కేశవ

కలిమిలేమిల జీవితం... ఆట కదరా శివ
పెళ్లి ,పిల్లల తంతు వట్టి మాయ కద కేశవ


నీది నాది అని తగువు... ఆట కదరా శివ
కాలే కట్టె కూడా నాతో రాదు కద కేశవ


ఆట కదరా శివ... ఆట కద కేశవ

శివోహం

ప్రేమికుడంటే పరమేశ్వరుడే.అమ్మకి తనలో సగానిచ్చి జనానికి ప్రేమతత్వాన్ని బోధించిన

ఆది ప్రేమగురువు నా ప్రభువు.

ప్రేమిస్తే శివుడిలా ప్రేమించాలి.శివుడిలా ఆ ప్రేమను గెలిపించుకోవాలి. శివుడిలా ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

కృష్ణుడు! అంటేనే పరమానందం, అందం ఆనందం ,కలబోసిన సుందర సురుచిర భువనైక సమ్మో హన ప్రేమైక శక్తి స్వరూపం...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...