జీవుడు జననం నుండి మరణం వరకు సాగే
చిత్రవిచిత్రమైన జీవనయాత్ర నాలుగు మాటలలో
ఎవరికీ ఎవరూ ఈ లోకంలో ఎవరికి ఏమి కారు
నా వారు అంటున్నావు ఎవరూ నీ వారు
నీది ఏది ఉన్నది ఈ ప్రపంచంలో
నువ్వెక్కడ నీ అందమెక్కడ
కోరికల వలయములో చిక్కిన నీవు
చిగురాకు మాదిరి ముడతలు పడి
కొమ్మనోదిలి క్రింద రాలి చిరిగి చెదలు పట్టి
నేలలో కలిసిపోతివే
నేల నుండి నింగి వరకు ఏదియు నీది కాదు
విశ్వమంతా విశ్వనాథుడే వ్యాపించి ఉన్నాడని
తెలియక అంతరంగం అంతయూ నేను నేను అన్న అహము కరిగి చివరికి కాటిలో కలిసిపోయే నీ కాయముతో సహా ఆత్మ పరమాత్మ ను
చేరుటే గానీ పాపాల మూట తో రాలుటకు ముందు
ఒక్కసారి అయినా శివా శివా అన్నావా
ఏనాడైనా సత్సంగానికి వెళ్లి శివ శివ ఆన్నావా
ఎప్పుడూ సంతోషంగా జీవించలేదే
ఉన్న సంపదలతో ఆత్మ శాంతి కలగలేదే
ఈ రోజు కట్టెల పాన్పు పై కదలక పడుకుంటివే ఇంత కష్టపడిన నీవు నీ వెంట వచ్చిన సంపద ఏదీ
ఎక్కడ నిన్ను కన్న తల్లి తండ్రులు
ఎక్కడ నీ ప్రియమైన సతీమణి
ఎక్కడ నీకు పుట్టిన బిడ్డలు
ఎక్కడ నీ మీద ప్రేమ చూపించే బంధువులు
ఎక్కడ నిన్ను అభిమానించే స్నేహితులు
అన్ని విడిచి అందరిని వదిలిపోతివి
ఏనాడు శివ నామాన్ని పలుకక అత్మవై పైకీ ఎగిరితివే
ఇదేనా ఈశ్వరుడు ఇచ్చిన జన్మకు నివిచ్చే సందేశం
కాదు కాదు అలా ఎప్పటికీ కాకూడదు
జన్మకు అర్ధము మోక్ష సాధనయే లక్షము
No comments:
Post a Comment