మనస్సుకు, బుద్ధికి కూడా అందని పరమపవిత్రమైన అనుభూతే ప్రేమ. ప్రేమ బందించదు, బాధించదు.
అది స్వేచ్చాయుతభావం
స్పష్టత
సరళత
సౌమ్యత
స్వచ్ఛత
స్వేఛ్చ దాని స్వభావం.
ప్రేమనేది ఓ స్థితి.
ఆ స్థితిని అనుభవించాలి.
మనస్సు నిర్మలమై, నిశ్చలముగా వుండి దేనినీ ఆశించకుండా, దేనినైన అంగీకరించగలిగే స్థితిలో వున్నప్పుడే ప్రేమస్థితి సంపూర్ణముగా అనుభూతికి వస్తుంది.
ఆ స్థితిలో వుండగలిగితే ఏది చూసిన, ఏది ఎలా వున్నా, ఎవరితో వున్నా ప్రేమగానే స్పందిస్తాం, అనుక్షణం ప్రేమను ఆస్వాదిస్తాం, ఆనందముగా జీవిస్తాం.
ఎన్నో భిన్నత్వాలుతో కూడుకున్నది భగవంతుని సృష్టి.
అయినా అన్నిటిని ఏకత్వముతో చూడగలిగే ప్రేమత్వమును పొందుపరిచాడు.
ఆహా ఎంతటి చమత్కారుడు ఈ సృష్టికర్త...
ఓం శ్రీ కృష్ణపరమాత్మనే నమః
No comments:
Post a Comment