Wednesday, October 7, 2020

హరే కృష్ణ

యశోదమ్మ ప్రేమకి తలవంచి తాళ్లకే వశమయ్యాడు వంశీకృష్ణుడు. ఆ అనంతుడుని ఓ త్రాడుతో బంధించడమా...

ఎవ్వరికైనా ఇది సాధ్యమా? యశోదతల్లి ప్రేమకే అది చెల్లు.
ఆహా అచ్యుతుడునే మురిపంతో బందీ చేసిన ఈ ప్రేమ అనిర్వచనీయం.
కృష్ణుని రూపం తలచుకోగానే చేతిలో వేణువు, తలపై పించం గుర్తుకొస్తాయి.
పిల్లనగ్రోవి లేని కృష్ణుడుని ఊహించలేము.
కానీ రాధ మధురప్రేమకి పరవశం అయిన కృష్ణుడు, రాధ భౌతికముగా లేదన్న వార్త తెలియగానే మురళినే శాశ్వతముగా విడిచిపెట్టేశాడు.
రాధ పరమప్రేమ పరమాత్మున్నే కదిలించింది, కలచివేసింది.

ఆహా ఎంతటి దివ్యమైనది ఈ ప్రేమ...

No comments:

Post a Comment

శివోహం

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! అంధకారము లోని ఆనందం అవని దాటి పుంతలు తొక్కుతొంది... సంధికాలంలో  నవవసంతం పుడమి...