భక్తి పంజరములో భందీని శ్రీ కృష్ణ
పంజరము వీడిపోను! భాదలెన్నున్నా!
కాంతిలో కాంతితో కలిసిపోయేదాక
కడదాకా నీతోనే కలిసి పయనించెదను
వన్నెలను చిన్నెలను వయ్యారములు జూపి
మధురమగు నీ మురళి మాధుర్యమును బడితిని
తిరిగిపోనెన్నటికి జేరనింకెవ్వరిని
జన్మ జన్మలదాక జెరియింతు నీతోనే
పంజరము నుండి నన్ను బయలులో వదిలినను
మబ్బులలో వదిలినను మరలా తిరిగి వచ్చెదను
నీ భక్తి పంజరమున నీడనుందును కృష్ణా
కన్నార నను చూచి చెన్నార యద చేర్చి
తీయని మురళిని చేర్చునందాకను
విచ్చిన పూదీవె విడిన పూవుల రీతి
జన్మలెన్నెయినను చరియింతు నీతోనే
No comments:
Post a Comment