మూడు కళ్ళు కలిగినవాడు
అనగానే మనం కన్నుని చూడడానికే
ఉపయెగించేవాళ్లం కాబట్టి ---
మూడవ కన్నుతో ఎలా చూస్తాడు ?....
అని ఆలోచిస్తాం ---
కానీ శంకరుని మూడవ కన్ను
చూడటం కోసం ఉపయోగించే మిగిలిన
రెండు కళ్ల వంటిదీ కాదు
ఏ కుడి కన్ను సూర్యుడో
ఏ ఎడమ కన్ను చంద్రుడో
ఆ రెండు కన్నులకీ కావల్సిన.
సంపూర్ణ శక్తిని అందించ గలిగిన. తేజస్సు
తనలో నింపుకున్న. కన్ను మూడవ కన్ను
అందుకే చంద్ర సూర్యాగ్ని నేత్రైః --
చంద్రుడూ సూర్యుడూ అగ్ని
అనే మూడు నేత్రాలతో
విరాజిల్లేవాడు శంకరుడు
మహా ప్రళయాన్ని సృష్టించే సందర్భంలో
ఇదే శంకరుడు ఆకాశంలోని పన్నెండుమంది
సూర్యులన్నీ ఒకే ఒక్క. మారు ఉదయించేలా
చేసి అందరి తేజస్సుల్నీ ఒక్కచోట.
కేంద్రీకరించేలా చేసి
చెప్పలేని వేడిమిని సృష్టించి
మొత్తం ప్రపంచాన్ని మాడ్చివేయగల
శక్తి శంకరుని తేజస్సుకి మాత్రమే ఉంది !!
శంకరునికి పినాకమనే పేరు
గలిగిన విల్లు ఉంది అందుకే
అందుకే ఆయన పేరు పినాకపాణి అని
ఆకాశంలోని పిడుగు ఏడుందో --
దానిలోని శక్తి మొత్తం తన పినాకంలో
ఉండేలా నిక్షిప్తం చేసుకున్నాడు కాబట్టే
ఒక్కసారి దాని వింటివారిని లాగి చూసినట్లయితే
ఆకాశం మొత్తం ఈ ధ్వని ప్రతిధ్వని రూపంగా
ప్రపంచాన్ని ముంచివేస్తుంది
శంకరుని తేజస్సు సామాన్యమైనది
కాదు కాబట్టే శరీరమంతా తేజోమయం
కాబట్టే శంకరుడు శరీరచ్చాయలో
నీలోహితః చెప్పలేనంత
ఎర్రదనంతో ఉంటాడు
No comments:
Post a Comment