అక్షర సత్యాలు
🔮బాహ్య పరిస్థితులు నెలకొల్పడానికి మీకు బయటి వ్యక్తుల, శక్తుల సహకారం కావాలి.అంతర్గత పరిస్థితులు నెలకొల్పడానికి మీకు కావలసింది మీరు మాత్రమే..!!
🔮మీ ఆరోగ్యం గురించి, మరీ అతిగా గాబరా పడకండి. అలా గాబరా పడడమే ఒక రోగం..!!
🔮మనము ఏర్పర్చుకుంటున్న అపోహలే మన అజ్ఞానానికి , భయానికి, దుఃఖానికి, సమస్యలకు కారణం.అపోహలను వదలి పెడితే అన్నీ పోయినట్లే కదా..!!
🔮మనం మాట్లాడే భాష మరణించే వారిని కూడా బ్రతికించేదిగా ఉండాలి కానీ, బ్రతికి ఉన్న వారిని మానసికంగా చంపేలా ఉండకూడదు..!!
🔮కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వారు హింసకు దూరంగా ఉంటారు...!!
🔮వాస్తవానికి మనిషిని చంపేసేంత బలమైన సమస్య ఏది భగవంతుని సృష్టిలో ఉండదు. కానీ సమస్యను చూసి బలహీనంగా మారే మనసులు మాత్రం చాలా ఉంటాయి..!!
No comments:
Post a Comment