Saturday, July 31, 2021

శివోహం

శంభో...
నిను వీడి  ఉండలేను...
నను నేను వేరుగా  చూడలేను...
నువ్వే నేను నేనె నువ్వు...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం.

శివోహం

శివా!కర్మ బంధం జన్మలు కడతేరనివ్వదు
జ్ఞాన బంధం జన్మను దరి చేరనివ్వదు
ఆ జ్ఞానమీయి ,జన్మ నెడబాటు చేయి
మహేశా . . . . . శరణు .

శివోహం

పుట్టుకలోంచి.....
బతుకులోకి....

బతుకులోంచి 
చింతనలోకి
 
చింతనలోనుంచి చితిలోకి చేరాక చిత్తగించు
జీవిత భ్రమణాన్ని అక్కడే ముగించు....

మహాదేవా శంభో శరణు

Friday, July 30, 2021

శివోహం

రెండు ఊపిరుల నడుమ క్షణకాలం ఆగిన సమయంలో నిశ్శబ్దానివి నీవు...
ప్రాణాయామం తర్వాత మౌనంలో శబ్దానివి నీవే కదా పరమేశ్వరా...
అయితే అనుక్షణం ఆ భావనలో మమ్మల్ని నిలపవేమి తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!కాస్త సురగంగలో తడపమంటే
ఏకంగా సంసార సాగరం లో ముంచేసావు
బయట పడేదెలా ? బదులు పలుక వేల ?
మహేశా ..... శరణు .

శివా!నీ కలలో నేనుంటూ
కలనైనా నిన్ను చూడాలనుకుంటూ
కలలు కంటున్నాను కాలకంఠా
మహేశా . . . . . శరణు .

శివా!శుద్ధ జలమునకు సరితూగు
నా భాష్ప జలధారల నిన్ను
అభిషేకించితి కాస్త అనుగ్రహించు
మహేశా . . . . . శరణు .

శివా!వెలుగులోన వెలుగు చూడ వీలుకాదని
చీకట్లో చూస్తున్నా నీ వెలుగు కోసమై
వెలుగు చూడనీవా ఆ వెలుగు నీవు కాగా
మహేశా . . . . . శరణు .

శివా!ఏ మాటను చెప్పను నీ మాటగ నేను
నా మాటకు మౌనాన్ని ఎలా అన్వయించను
అనుభవించ చెప్పనా అన్వయించలేనని
మహేశా . . . . . శరణు .

శివా!నా పాట్లునెరిగి నిను నేను మరిగి
మనపుచున్నానయ్య నీ స్మరణతో
మసలుచున్నానయ్య నీ కరుణతో
మహేశా . . . . . శరణు .

శివా!నీ పాద దూళి నన్ను తాకి
నా దేహము దూళిగా మారి
నిన్ను చేరనీ నేను మాయనీ
మహేశా . . . . . శరణు .

శివా!నన్ను బాణముగ  సంధించి
నీవన్న లక్ష్యాన్నికి విడిచిపెట్టు
నీ గురికి తిరుగేది నాకింక చింతలేదు
మహేశా.....శరణు.

శివా!నా మనుగడ సాగించగ
మూడవ కన్ను నెరిగించు
నన్ను నీవు గెలిపించు
మహేశా . . . . . శరణు .
శివా!నేను నాకు తెలిస్తే
నీవె తెలియ వస్తావు
తెలిసేది ఇంక లేదు పొమ్మంటావు
మహేశా . . . . . శరణు .


శివా!మౌనాస్వాధన మధురమెరిగి
మౌన బాష మీద మనసు పెరిగి
మౌనిగా ఉన్నాను ఆ రుచి మరిగి
మహేశా . . . . . శరణు .

శివా!కాయాన్ని మోసేవు కానకుండా
కష్టాలు మోసేవు చెప్పకుండా
ఇష్టాలు తీర్చావు నొచ్చకుండా
మహేశా . . . . . శరణు .

శివా!విషమ పరిస్థితి చూసి వణుకు పుట్టె
బ్రతుకు తీరు  తెలిసి భయము పుట్టె
ఉద్దరింతువన్న విశ్వాసం నా వీపు తట్టె
మహేశా . . . . . శరణు .

శివా!నాలో ఉంటూ నాకెందుకు అనిపించవు
నాతోనే ఉంటూ నాకెందుకు కనిపించవు
ఇది దృష్టి దోషమా , సృష్టి దోషమా... ?
మహేశా ..... శరణు.

శివా!ఈ మరణ మృదంగం ఆపవయ్యా
ఉత్తుంగ గంగా తరంగాలు పంపవయ్యా
కొట్టుకొని పోవగ ఈ విషమ పరిస్థితి .
మహేశా . . . . . శరణు .

శివా!శవాల జాతర చాలయ్యా
భయాలు మాపగవేమయ్యా
బిరాన బ్రోవగ రావయ్యా
మహేశా . . . . . శరణు .

శివా!ఇచ్చి పుచ్చుకొనుట తప్ప కాదుగా
ములుగుతున్న మనసు నీకు ముట్ట చెబుతాను
మనసుపడ్ఢ మౌనాన్ని నాకు అప్పజెప్పు
మహేశా . . .  .  . శరణు .

శివా! రేయి పగలూ నీకు లేవుగాన
నిత్య పూజలు  నీకు లెస్సగాన
దోషమెంచకు నా పూజ ఎప్పుడైనా
మహేశా ..... శరణు.

శివా!నా ధ్యానం లో ఉన్నావు
నా గానంలో ఉన్నావు
తన్మయత్వమునె నీవు తెలియుచున్నావు
మహేశా . . . . . శరణు .


శివా!చెప్పగా నీవు చుట్టి ముట్టి వున్నావు
చూడగా మరి చూపుకు అందకున్నావు
చూడనివ్వు....ఆ చూపునివ్వు .
మహేశా . . . . . శరణు .

శివా!కాల్చవేమయ్య కాస్త కన్ను తెరచి
ముంచవేమయ్య ఓ జడపాయ విడచి
నిలువ సాధ్యమా ఏ విపత్తు నిన్ను తెలిసి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!ఎదుట నీవు కానరావు
ఎదను నేను కానలేను
ఎదుట పడేదెలా నీవు నేను
మహేశా . . . . . శరణు .

శివా!"నేను "నేనని అంటున్నది ఒక మేను
"నేను" ను తెలుసుకో అంటున్నది ఒక నేను
"నేను" తెలిసేదెలా ఈ మేను మరిచేదెలా
 మహేశా . . . .   శరణు .

ఎఱుక కలిగెను నాకు ఎదను నేడు
తృప్తి నొందితి నేను తెలియగాను

 నమఃశివాయ నమః హరాయ

ఒక్కటైన జగతిలో ఒక్కడే శివుడు
రెండుగా రూపించు రేడు ఈ శివుడు
మూడు లోకములేలు ముక్కంటి శివుడు
నాలుగు వేదాలు కలగలుపు శివుడు

ఐదు అక్షరముల మంత్రమే శివుడు
ఆరు చక్రాల పైవెలుగు శివుడు
ఏడు ఏడు లోకాల ఏలిక ఈ శివుడు
ఎనిమిది మూర్తుల ఏకమే శివుడు

తొమ్మిది గ్రహాలకు తలకట్టు శివుడు
పది దిక్కులందు ప్రభవించు శివుడు
పది నొకటి రుధ్ర స్వరూపమే శివుడు
పది రెండు లింగాల వెలిగేది శివుడు

శివుడే  శివుడు శివుడే శివుడు
మహేశా.....శరణు.....

శివా!నీ మౌనం మాకు జ్ఞాన దీపిక 
జ్ఞాన గమ్యాన అది మాకు దివ్య సూచిక
ఆ సూచిక ఎదకందించె ఆనంద గీతిక
మహేశా . . . . . శరణు .

శివా!"నేను"కానిది ఒకటి కాలి బూడిద అయింది
ఆ బూడిద నీ అభిషేకానికి  సిద్ధమయ్యింది
"నేను" దేహమును వీడి నీలో ఐక్యమయ్యింది
మహేశా ..... శరణు .

శివా!ఈ దేహంలోకి ఎలా వస్తావో
ఈ దేహం విడిచి ఎలా వెళ్తావో
తెలియనీయవు ఆ తెలివినీయవు
మహేశా . . . . . శరణు .

శివా!ఆది అన్నది నీకే చెల్లు 
ఆధ్యంతములు లేని ఆదిదేవా
ఆది నుండి నిన్నే నమ్మితి ఆదుకోవయ్యా
మహేశా . . . . . శరణు .

శివా!హరి పాదాన అంత మక్కువేమిటి?
హరి పాదాన పుట్టిన గంగ  నీ నెత్తినేమిటి?
ఎంత అడిగినా చెప్పవేమిటి పెదవి విప్పవేమిటి ?
మహేశా. . . . . శరణు.

శివా! కొలవలేని నిన్ను ,కొలిచి మురుస్తున్నా
తెలియలేని నిన్ను, తెలియ తపిస్తున్నా
తెలియవయ్యా నాకు తెలివి నొసగి.
మహేశా.....శరణు.

శివా!చెట్టుకింద చేరి చప్పున కూచున్నావు
చూపులతోనే జ్ఞాన బోధ చేస్తున్నావు
మౌనంలో నీ మాట నా మనసున విరియనీ
మహేశా . . . . . శరణు .


శివా! నీకూ నాకూ ఎడబాటే లేదు
ఇందులో తడబాటే లేదు
నీవు నాలో....లేదా.....నేను నీలో...
మహేశా.....శరణు.

శివా!ఆరాధనతో భక్తి ,నామంతో శక్తి ,
జ్ఞానంతో ముక్తి ,సాధించుట యుక్తి ,
ఇవి నేనెరుగ కలిగించు అనురక్తి
మహేశా . . . . . శరణు


శివా! బదిలీలు ఎన్ని జరిగినా
మజిలీలు ఎన్ని చేసినా
మారలేదు గమ్యం  నీవే శరణ్యం
మహేశా ..... శరణు.

శివా!ప్రసాదానికి పదార్ధ నామం లేదుగా
ఈ దేహం నీ ప్రసాదమే కదా
మరుగవనీ నామం మెరుగవనీ జీవితం
మహేశా . . . . . శరణు .

శివా! వంక జాబిలి నీ సిగ పూవుగా
నిండు జాబిలి నీ శుభ నేత్రంగా
గగనమంత మెరిసేను నీ రూపంగా
మహేశా ..... శరణు.

శివా!కాస్త సురగంగలో తడపమంటే
ఏకంగా సంసార సాగరం లో ముంచేసావు
బయట పడేదెలా ? బదులు పలుక వేల ?
మహేశా ..... శరణు .

శివోహం

శివా!కంటి చూపుతో కాముడు చిత్తు
జడ పాయతో దక్షుడు చిత్తు
సర్వ జగములందు నీవే సత్తు
మహేశా . . . . . శరణు .

శివా!నాభి బంధము నాడు నీ ఎఱుక ఉండి
నాభి బంధము వీడ  నా ఎఱుక పెరిగె
నా ఎఱుక తొలగనీ నీ ఎఱుక పెరగనీ
మహేశా ..... శరణు.

శివా!పంచాక్షరి స్మరణం చేస్తూ
ప్రణవాన్ని శ్రవణం చేస్తూ
నీ కోసం తపిస్తున్నా
మహేశా ..... శరణు.

శివా!మన్నన పొందిన మౌనం
మనసుకి నచ్చిన మౌనం
మెచ్చగ నీవిచ్చిన  వరం
మహేశా . . . . . శరణు .

శివా!అంతటా అన్నిటా అరూపి గాను
గుడిలోని మాకొరకు అరూపరూపి గాను
అమరి వున్నావయ్య అద్భుతంగాను
మహేశా . . . . . శరణు .

శివా!నా చేతలు పట్టించుకోకు 
నా గోడు పట్టించుకో
నీ ఇంటికి రప్పించుకో
మహేశా . . . . . శరణు .

శివా!ఎరగని దూరంలో ఎదలోనే వున్నావు
తెలిసిన రూపంతో తెలియరాకున్నావు
తెలిసివచ్చేదెలా తెలియవచ్చేదెలా
మహేశా . . . . . శరణు .

శివా!నీవు నేను అనుకుంటె ద్వైత్వం
నీవే నేను అనుకుంటే అద్వైతం
ఆ భావన  పెరగనీ నా జ్ఞానం విరియనీ
మహేశా.....శరణు..

శివా!శ్వాసగా సాగనీ నీ నామ జపం
ఆవిరైపోనీ ఆశలన్నీ ప్రతిక్షణం
కుంభవృష్టి కానీ నీ కటాక్ష వీక్షణం
మహేశా . . . . . శరణు .

శివా!మోజు పడి చేస్తున్నా మౌనం
యోగిరాజువని చెపుతున్నా నా వైనం
రివాజుగా సాగనీ నా పయనం.
మహేశా ..... శరణు .

శివా!నా చూపు నీవైపు తిరగాలి
నీ రూపు నాకంట మెరవాలి
ఆ మెరుపున నేను మురియాలి
మహేశా . . . . . శరణు .


శివా! బుద్ది ఒక తీరు మనసు ఒక తీరు
ఆ రెంటి నడుమా నిత్యమూ పోరు
ఎద్దు,ఎనుబోతులా ఈ బండికి
మహేశా.....శరణు.

శివా! సంసారాన్ని పోల్చగ సాగరం సృష్టించావో
సాగరాన్ని పోలిన సంసారాన్ని కూర్చావో..గానీ
సంసార ,సాగరాలు దాట కష్టసాధ్యమాయె.
మహేశా . . . . . శరణు .

శివా!పరశుతో నా బంధాలు తెంచివేయి
కైలాసాన ఏ కొయ్యకో కట్టివేయి
ఇంకేమైనా అడిగినచో ఒట్టువేయి
మహేశా . . . . . శరణు .

శివా!స్వల్పకాలిక లయానికి నీ స్మరణ తోడయింది
మరణ మెరుగ జేసి మరునాడు నిదుర లేపింది
జనన మరణ చక్ర జ్ఞానాన్ని తెలియ జేసింది
మహేశా . . . . . శరణు .

శివా!కడలిలో ఉన్నావో కొండపై ఉన్నావో ...
ఎద్దుపై వస్తావో ఎగిరెగిరి వస్తావొ...
కరుణించి కట్టెదుట కనిపించు చాలు
మహేశా ..... శరణు.

శివా!నీ కరపాత్ర కావాలని కలలు కంటున్నా
కలలు నిజమౌనట్టు కరుణించమంటున్నా
కినుక ఇక చాలు కూడ రమ్మంటున్నా
మహేశా . . . . . శరణు .

శివా!నా కర్మ నిశ్శేషమవ్వాలని
నీ చేతి కరపాత్ర కావాలని
కర్మించుచున్నాను కనుచూడవా
మహేశా . . . . . శరణు .

శివా! నా జీవిత గానానికి  శృతి నీవే
నా జీవితయానానికి గతి నీవే
నా గతిలోన గతి చూపే జ్యోతివి నీవే
మహేశా ..... శరణు.

శివా!ఆకృతి లేని నీ ఘనత కృతులుగా
పెక్కు స్వరములు ఒకటిగా ఆలపించినా
పారవశ్యమందితి నేను నేనుగా
మహేశా . . . . . శరణు .

శివా! వెంటబడి వస్తున్నాయ్ వాసనలన్నీ
కనబడకనే తరుముతున్నాయ్ కర్మలు అన్నీ
క్షయము చేయి ఆ రెంటిని క్షంతవ్యుడ నేను
మహేశా ..... శరణు.

శివా!కాలగర్భంలో కలసినన్ను
కాలానికి మరల అందనీయకు
అంతులేని వ్యధలపాలు కానీయకు
మహేశా . . . . . శరణు .

శివా!ఇద్దరికీ చెరి సగము పంచి
నీ సగము కూడగ ఇద్దరినీ పెంచి
ఇనుమడించినావు ఇద్దరియందు
మహేశా . . . . . శరణు.

శివా!నామాటను మలుపు తిప్పావు
నాకు మౌనాన్ని మప్పావు
నీ కరుణ ప్రసరించి మనో వాంఛ సిద్దించనీ
మహేశా . . . . .  శరణు .

శివా!ఓనమాలు ఒడిసి పట్టి దిద్ది
నీ నామాలను  ఎదనిండా అద్ది
స్మరణ చేస్తుంటే మనసాయెను శుద్ధి
మహేశా . . . . . శరణు

శివా!ఎదుట నీవు కానరావు
ఎదను నేను కానలేను
ఎదుట పడేదెలా నీవు నేను
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!కంటి చూపుతో కాముడు చిత్తు
జడ పాయతో దక్షుడు చిత్తు
సర్వ జగములందు నీవే సత్తు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా!కంటి చూపుతో కాముడు చిత్తు
జడ పాయతో దక్షుడు చిత్తు
సర్వ జగములందు నీవే సత్తు
మహేశా . . . . . శరణు .

శివోహం

అజ్ఞానం
అవిద్య
అవివేకం అనబడే ఒక అడ్డు తెరలో నిన్ను నేను తెలుసుకోలేకున్నా...
నీ అనుగ్రహం లేనిదే నీ పై బుద్ది పుట్టదు కదా....
జ్ఞానబుద్ధిని ప్రసాదించు నివైపు నా దారి మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అజ్ఞానం
అవిద్య
అవివేకం అనబడే ఒక అడ్డు తెరలో నిన్ను నేను తెలుసుకోలేకున్నా...
నీ అనుగ్రహం లేనిదే నీ పై బుద్ది పుట్టదు కదా....
జ్ఞానబుద్ధిని ప్రసాదించు నివైపు నా దారి మళ్లించు...

మహాదేవా శంభో శరణు...

Wednesday, July 28, 2021

శివోహం

శివోహం

సంపద లెరుగను సొంపైన 
నీ నామంబుతప్ప....

ధనమును కాంచను ఘనమైన 
నీ రూపంబు తప్ప....

భవనములు ఎరుగను భవ్యమైన 
నీ చరణారవిందములు తప్ప....

కనకపురాసులు ఎరుగను కోమలమైన 
నీ కృపా కటాక్ష వీక్షణములు తప్ప....

మహాదేవా శంభో శరణు.....

శివోహం

విధేయునిగా వినమ్రతతో ఉండి భక్తితో 
పూజిస్తే ఆ దేవదేవుడే దిగిరాడా మన చెంతకు...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, July 27, 2021

శివోహం

అంతటా తానై...
అన్నీ తానై...
అందరిలో తానై...
ప్రాణుల మనుగడకు...
సృష్టి  స్తితి లయాలకు...
కాలచక్ర భ్రమనానికి కారణ భూతమై...
సూర్య చంద్రుల రూపంలో...
కళ్ళ ముందు నిత్యం వెలుగొందుతూ దర్శన మిస్తు...
నిత్యం మమ్మల్ని నిత్యం కాపాడే వాడు మహాదేవుడు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నేను వెళ్లే ప్రతి చోట...
నా కన్నా ముందు నా మహాదేవుడు తప్పక ఉంటాడు...
అందుకే శివోహం అన్న ప్రతి సారి అహం పోయి
శివుడే అన్నింటా పిలిచినట్టు ఉంటుంది....

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, July 26, 2021

శివోహం

భస్మాన్ని ధరించిన ఆయన దగ్గర ఏముందీ అని అడుగుతారు కొందరు...
కానీ భస్మాన్ని మించిన పవిత్రమైనది ఈ సృష్టిలో వేరే ఏమీ లేదు...
జన్మాంతర పాపాలను దహించి వేసేదే భస్మం...
కాబట్టే, భస్మానికి 'విభూతి' అని పేరు...
విభూతి అంటేనే ఐశ్వర్యమనీ అర్థం...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నాకు గతాలు లేవు...
కాలం వాటిని కబలించింది...
రేపు అన్నది లేకపోవచ్చు...
కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది...

ఓం నమః శివాయ...

శివోహం

శంభో...
నా కర్మ లు మూట గట్టి వాటిని అనుభవించ మని వెంటబెట్టీ ఈ లోకంలో తోలితివా తండ్రీ

నిను వీడి  ఉండలేను నను వేరుగా  చూడలేను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మనసులేని మహానగరం లో నా తనువుంటే...
నా మనేసేమో నీ కైలాసం చుట్టు తిరుగుంది....
ఎందుకు ఈ ఎడబాటు....
ఇన్నాళ్లు ఈ నిరీక్షణ....
జాలిచూపు తండ్రి.....
మహాదేవా శంభో శరణు...

Sunday, July 25, 2021

శివోహం

శంభో...
నా కర్మ లు మూట గట్టి వాటిని అనుభవించ మని వెంటబెట్టీ ఈ లోకంలో తోలితివా తండ్రీ

నిను వీడి  ఉండలేను నను వేరుగా  చూడలేను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ఒక మనిషి తన జీవితములో దైవ లక్షణాలను ఆలవరచు కొంటే అతని జీవితమే స్వర్గం...

ఆ మనిషి దేవుడై ప్రకాశిస్తాడు...

ఒక మనిషి అసుర లక్షణాలను అమలుపరిస్తే అతని జీవితమే నరకం...

అతడే రాక్షసుడు

శివోహం

ఉదయ, అస్థమయాల నడుమ నా హృదయ లయకు అధిపతివి నీవు...
సృష్టి, లయల మధ్య నా స్తితి గతుల సారధివి నీవే కదా శివ...
నీవే శరణు...
మహాదేవా శంభో శరణు

Saturday, July 24, 2021

శివోహం

శంభో...
నీవు నాకు ఎన్ని జన్మలిచ్చినా నేను పలికేది ప్రణవమే...
నాకు ఏ రూపమిచ్చినా వినిపించేదీ ప్రణవమే...
పశువునైనా పక్షినైనా ఇతరమైనా అణువణువూ నీ సన్నిధియే కదా...
ఏమరపాటుగా నన్ను జన్మలనుండి వదిలేసినా
నేనుండేది నీగుండె గూటిలోనే తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Friday, July 23, 2021

శివోహం

తెల్లవారుజామున లేచి పాదాలు నేలని తాకగానే...
ఇంకా భూమి మీదే ఉన్నాను అనే ఆనందం...
అంత పరమేశ్వరుడి కృపయే కదా...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శంభో! నీ రాక నా కోరిక...
తీరిక చేసుకుని నాకోసం రావాలిక..
నన్ను నీతో తీసుకొని పోవాలికా...
మహాదేవా శంభో శరణు...

Thursday, July 22, 2021

శివోహం

నా మనసు పరిపరివిధాల పరిగెత్తుతూనే ఉంటుంది...
దానికి ఇంత  శివుడి విభూతిని పుస్తె చాలు...
అది శివ శివ అంటూ శివ నామ స్మరణ చేస్తూ శివుడి చుట్టే తిరుగుగుతూ ఉంటుంది...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

కలసి రాని కాలం తో కాళ్లకు బంధాలను కట్టుకుని ..
పరిగెడుతున్నాను కనపడలేదా...
బంధనాలు తెంచుకొలేని బంధీనై భాదలు నీతో మొరపెట్టుకున్నాను వినపడలేదా...
కాటేసే కష్టాలను ఎన్నేళ్ల ని మోయను..
మాటుగా తుడుచుకునే కన్నీళ్లను ఎన్నాళ్ళని దాయను....
ఎన్నని భరించను ఎంతని నటించను...
కనికరించి కరుణించు లేదా ఈ కట్టెను కడతేర్చు...

మహాదేవా శంభో శరణు...

Wednesday, July 21, 2021

శివోహం

ఓం నమః శివాయ
రుద్రాయ‌
వాసుదేవాయ
శంభవే
శరణ్యాయ
అగ్రగణ్యాయ
త్ర్యబంకాయ
నీలకంఠాయ తే నమః

Tuesday, July 20, 2021

శివోహం

నా నుదుటి గీతలు వ్రాసినా దేవా దేవుడివి నీవు...
వ్రాసినవి చేరిపి తిరిగి వ్రాయగలిగినది నీవే చదవగలిగేది నీవే పరమేశ్వరా...
నా నుదుటి వ్రాత నీచేతి రాత ఎలా ఉందో చూసుకో నన్ను కాచుకో సర్వేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

కాలగమనంలో కదిలే క్షణాలలో...
ఊపిరి ఊయల శివ పార్వతుల ధ్యానం చేయుచుండగా వినిపించే గుండె చప్పుడు ఓంకారమై...
విశాల లోకాలు ఆవరించి మహాదేవుడు
మదిలోకి ఉరుకుల పరుగుల నాట్య
మాడుచూ నా మనసు ముంగిట
నటరాజుగా నిలిచినాడు సతి పార్వతితో

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, July 19, 2021

శివోహం

శంభో...
జన్మ జన్మల జ్ఞాపకాలు
పాపాల రూపంలో గుర్తు
వచ్చి మనసు మూలుగుతోంది...
బాధతో, భయంతో.....
ఎవరికి చెప్పుకోను...
నీకే అప్పచెబుతున్నాను నన్ను నీ దరిచేర్చుకో...

మహాదేవా శంభో శరణు...

Sunday, July 18, 2021

శివోహం

శంభో
ఈ భువిపై నాచే నీవు ఆశించిన 
కార్యములు పూర్తి కాలేదనేనా...

ఈ యాతనల యాత్రల పొడిగింపు...
లోతు తక్కువ కొలనులు ఈద గలిగినా ప్రవాహాలు దాటలేకపోతున్నాను.
 పరమేశ్వరా...
నీ అభయహస్తం అదించి నీ దరికి చేర్చు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

యోగ యోగ యోగేశ్వరాయ
భూత భూత భూతేశ్వరాయ
కాల కాల కాలేశ్వరాయ
శివ శివ సర్వేశ్వరాయ
శంభో శంభో మహాదేవాయ

Saturday, July 17, 2021

శివోహం

గరికకు లొంగిపోయే గణేశుడు భక్తసులభుడు...
ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలేం అవసరం లేదు...
తండ్రి వలె దయగల మారాజు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసు లోని కోరికలను నెరవేరుస్తాడు...

ఓం గం గణపతియే నమః

శివోహం

కొలుతును నే మణికంఠుడిని... 
కొలుతును నే హరిహర పుత్రుని...
కొలుతును నే విఘ్నేశ్వర సోదరుని....
కొలుతును నే శంభు తనయుని...

ఓం శ్రీస్వామియే శరణం ఆయ్యప్ప....

శివోహం

శివునికి సతి మీదనున్న ప్రేమ ఎటువంటిది?
శివుడికి సతి మీదనున్న ప్రేమ గురించి మనం చాలా సార్లు విన్నాము. కాని అది ఆయన జీవితంలోని భావోద్వేగ పార్శ్వాన్ని కొంత సమయం అనుభవించారని, మళ్ళీ తాను అందులోంచి బయటికి వచ్చి నిశ్చలమైన అతీత స్థాయిలో ఉన్నారని సద్గురు మనకు శివ తత్త్వం గురించి చెబుతున్నారు...
Source: Sadhguru

శివోహం

హనుమ!!!
నీ మనసు మానవ సరోవరం....
నీ తేజస్సు హిమాలయం....
నీ రూపం రుద్రరూపం...
నీ శౌర్యం ప్రభాదివ్యకావ్యం....
నీ నామస్మరణ సర్వ దుఃఖ పరిహారం... 

జై శ్రీరామ్ జై జై హనుమాన్
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, July 16, 2021

శివోహం

ఈ పయనం ఎందాక మిత్రమా...
తనువు మనసు ఆత్మ ఏకం అయ్యి దివి నుండి భువి కి నిచ్చెన దొరికేంత వరకే కదా...
అందుకే నీవు ఎవరో తెలుసు కో...
వచ్చిన పని చూసుకో...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...