Tuesday, December 7, 2021

శివోహం

శంభో...
నీవు మాకిచ్చిన ఆకలి అవసరాలు నిన్ను మరిచేలా
చేస్తున్నాయి.
ఆ పోరాటంలో నీ ధ్యాస తగ్గుతున్న మాట నిజమే...
నీవేమో ఆకలితో అలమటించే మమ్మల్ని చూడలేక
ఆహారం, నీరు, అగ్ని, గాలి రూపాలలో ఆకాశమంత అండగా కాపాడుతున్నావు...
మా కడుపు నిండాక నిన్ను మరచి నిదరోయినా సోహం ఊయలూపి నిదురిస్తున్నావు..
నీ ఋణం ఎలా తీర్చేది శివ...
రాత్రి నిదుర ఊపిరి నీకే అంకితం తండ్రి...

మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...