భక్తి అనేది తెచ్చి పెట్టుకునే వస్తువేం కాదు
అది జన్మతహా ఆత్మలో నిక్షిప్తమై నీవు ఎదిగే
కొలది అదీ ఎదిగి వృక్షమై నిను రక్షించి సేద
తీర్చి శివ సాయుజ్యమౌవ్వాలి...
ఒకరి భక్తిని హేళన చేసినా వాని మనసును
నొప్పించినా వాని ఆత్మలో కూడా నీ ఆరాధ్య
దైవమే నివసించునని యెరుగు...
నా మాట వినక నీ ధోరణే నీదైతే ముక్తి కై పోరాడు నీ శ్రమను పరమాత్మ స్వీకరించడు...
అధోగతి పాలగుదువు...
తెలుసుకుని మసలి మనుగడ సాగించవే
మతిలేని నా మనసా....
No comments:
Post a Comment