చేతికి సంకెళ్లు వేసీ...
పాప పుణ్యాలు చేయిస్తుంటావు
మనస్సుకు శాంతి కల్పించకా...
మమ్ము ఆడిస్తూ ఉంటావు...
చలి కల్పించీ, సుఖం ఇచ్చేటి వేడితో కల్వ మంటావు...
సంసార పోషణకూ సంపద కొరకూ తిప్పు తుంటావు...
భోగవిరాగముల చుట్టూ తిప్పి సంతోష పడతావు...
ఒక్కరి కష్టంతో, కొందరి ప్రాణాల్ని రక్షించ మంటావు...
మంచో చెడో, తెల్సుకునే శక్తి ఇవ్వక మాయ చేస్తావు...
ఇష్టాల్ని కష్టాలుగా కష్టాల్ని ఇష్టాలుగా మారుస్తావు...
ఐనా నీవేగతి మాకు వేరు దారి లేదు...
No comments:
Post a Comment