Saturday, June 17, 2023

శివోహం

నేను జన్మ జన్మాంతరము...
సుదీర్ఘ  ప్రయాణం చేస్తూ అలుపెరుగని ఒక  బాటసారిని...
నా ధ్యేయం  నీ సన్నిధిలో  చేరడమే...
ఈ జన్మలో  ఈ శరీరం మోహన్ అన్న పేరుతో పిలువబడుతూ ఆది అంతు లేని  ప్రయాణం చేస్తూ ఉంది...
గమ్యం తెలియని  నా జీవనం నా ఈ అనంతమైన యాత్ర నీతో అనుసంధానం చెందేవరకూ ఈ  యాత్ర అలా అలా సాగుతూ పోవాల్సిందేనా శివ...
నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా  మార్చి ఆనందంగా ఆడుకుంటూ లీలగా వినోదిస్తూ నాలో అంతర్యామిగా ఉంటూ నాతో కర్మలు చేయిస్తూ ,అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో, ఎప్పుడో అయిపోయింది అంటూ చివరకు తెరదించేస్తు ఉంటావు...
మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు ఇదంతా ఏమిటి స్వామీ...
అంతులేని ఈ కథకు అంతు పలకవా తండ్రి...
ఇక జనానమరణ ఆట ఆడడం నా వల్ల కాదు...
అలసిపోతూ ఉన్నా ఈ జీవుడికి ఈ జీవన చక్ర పరిభ్రమణ వలయంలో నుండి విముక్తిని ప్రసాదించు తండ్రి....
నీ పాద కమలాల ముందు శరణాగతి చేస్తున్న ఈ దీనుడిని కరుణించు తండ్రి...
నీవే తప్ప అన్యమేరగని నాకు వేరే దిక్కు లేదు...
మహాదేవా శంభో శరణు.

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...