మాధవా
నిన్ను ఏమి కోరాలి?
పుట్టగానే కన్న తల్లి తండ్రులకు దూరం అయినా
మాకు ఆ ప్రేమలో
మాధుర్యం అందేలా చేసావు
ప్రతీక్షణం క్రూర రాక్షసుల నుంచి
ముప్పును ఎదుర్కొన్నా
మాకు అలాంటి పరిస్థితి రానీయని
కుటుంబములో ఉంచావు
ప్రాణ ప్రదమైన ప్రేమకు
దూరమైనా అంతటి
ఓపలేని ఆవేదనను
మాకు కలుగక చూసావు
ఎన్నో అవమానాలకు
ఆపనిందలకు గురైనా
మాకు అంతటి క్లిష్ట
పరిస్థితులు రాక కాచావు
నిరంతరమూ ధర్మాన్నే
ఆచరిస్తూ కాపాడుతూ
మాకు మార్గదర్శకత్వం చేస్తూ
ఎదలోనే పదిలంగా ఉన్నావు
కుచేలుని ఆదరించి అక్కున చేర్చుకున్న
స్నేహ ధర్మం నీది
బాలరాముని నిరంతరమూ
గౌరవించిన భ్రాతృ ధర్మం నీది
సర్వం కోల్పోయిన పాండవులకు
రాజ్యం కట్టబెట్టిన గొప్ప యుగ నీది
దుష్ట శిక్షణ
శిష్ట రక్షణా స్వాసగా సాగిన
అవతార ధర్మం నీది
ప్రతి తల్లీ తన కొడుకుని
నీలా అనుకొని కన్నయ్యా
అని పిలుస్తుంది
ప్రతి సఖీ తన ప్రియునిలో
నీ ప్రేమ తత్వాన్ని ఊహించుకొని
కన్నాయ్యా అనే సంభోదిస్తుంది
ప్రతి ఉన్నతమైన ప్రేమలో
నీ పిలుపే నీ తలపే
నిన్ను ఏమి అడిగినా తక్కువేనయా
నీవు నా ఊపిరిలో
నిలిచి నన్ను నీలో కలుపుకో
కన్నయ్యా
అదే నాకు గొప్ప వరం