Sunday, December 31, 2023

శివోహం

నాతో నేనే మాట్లాడుకుంటున్నాను
నాలో ఉన్న నీవు వింటావని
చుట్టూ ఉన్న పంచభూతాలు వింటాయని
ప్రకృతి మాత గమనిస్తుందని
నిన్ను చూస్తూనే
నిన్నే తలుచుకుంటూ
నాతో నేనే మాట్లాడుకుంటున్నాను

మహాదేవా శంభో శరణు.

గణేశా

ఓ విఘ్నారాయ
పార్వతి తనయ
పాడేది నీ గానమే..
పలికేది నీ నామమే..
ఓ గణనాథ భక్త వరద వేడు కొందు నెపుడు నిన్ను
విఘ్ననాథ భక్తితో ఆపదల నుండి మము నాదుకోనుము..

ఓం గం గణపతియే నమః.

Saturday, December 30, 2023

హరి

నీ బంధువులంతా
నాకూ బంధువులే
నీవు నాకు ఆత్మబంధువు
హరి శ్రీహరి శరణు.

Friday, December 29, 2023

హరి శ్రీ హరి శరణు

అంతర్యామి 
సర్వాంతర్యామి
నీకు నాకు ఇక భేదమేమి హరి
నా ఊపిరి జపమాల
ఉఛ్వాసనిశ్వాస నీ స్మరణా.. 
ఈ తనువూ మనసూ నీకే సమర్పణా కదా
వేంకట రమణా.

మణికంఠ శరణు

హరిహర పుత్ర అయ్యప్ప...
జరిగేది , జరుగుతుంది, జరగబోయేది అంత కృపవలననే..
నేను నడిచే క్రమంలో నను నడిపించే సమయంలో ఏ ఆటంకాలు రాకుండా చూడు తండ్రి...
నీ చల్లని చూపు మాపై ఉండే దయచూడు మణికంఠ మణికంఠ.

ఓం అన్నదనప్రభువే శరణం అయ్యప్ప.
ఓం పరమాత్మనే నమః

శివోహం

నీవే రక్షకుడవు...
నీవే సర్వేశ్వరుడవు...
నీవే శబ్దస్వరూపుడవు...
ఈ జగత్తులోని నీవే సర్వము ...
సర్వము నీ స్వరూపమే...
ముల్లోకములకు ప్రభువు నీవే...
ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, December 28, 2023

శివోహం

నాదరూపిణీ 
ఓంకారస్వరూపిణి
విఙ్ఞాన స్వరూపిణి
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.
అమ్మ శరణు.
ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

గడబిడ మనమున గుండెలో అలజడి కలుగుతుంది పరమేశ్వరా
నీవే నాకు కొండంత అండగా ఉండి
నన్ను కాపాడగారావా.

మహాదేవా శంభో శరణు.

Wednesday, December 27, 2023

శివోహం

మృత్యు మహా సర్పం నన్ను కౌగిలించుకున్నప్పుడు నిన్ను గుర్తు చేయి మహాదేవా.

శివ నీ దయ.

శివోహం

శివ...
కలత నిద్రలో ఒక ఉలికిపాటు స్పర్శ...
మనదో పురాతన బంధమనుకుంటా...
కల నిజమవ్వాలి నేను నీ దరి చేరాలి...
మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!నిప్పులు కురిపించు నీ నిలువు కన్ను
శీతోష్ణములు కూడి పంచు నీ అడ్డు కళ్ళు
ఏమి నీ నేత్రాలు అవి సృష్టిలో చిత్రాలు
మహేశా . . . . . శరణు .

శివోహం

వానకాలమేమి కాదు...
అదేమి వానో కానీ గుండె బరువుతో కన్నీటి వానా కురుస్తుంది నిన్ను అభిషేకించాలని కాబోలు.

శివ నీ దయ.

శివోహం

శివా ! 
నేనో పశువుని...
నీవు పశుపతివి...
ఇంతకంటే ఏం కావాలి సంబంధం...
నాపై నీవు దయ చూపించటానికి...
మహాదేవా శంభో శరణు.

Tuesday, December 26, 2023

శివోహం

శివాచిత్రాల భూమిగా చిరునామా చూపించి
మట్టి దిబ్బను ఏల ఇల్లుగా చేసావు
ఆ ఇల్లు ఎఱుక ఏలనో , తెలియనీకున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

హరిహరపుత్ర అయ్యప్ప...
భౌతిక మౌనం తేలికగా ఉన్న....
నా మనసు అదుపులో లేక పరిపరి విధముల అదుపు తప్పుతోంది...
నా మనసుని మట్టు పెట్టు అట్టి పెట్టు నీవు నాకు తెలిసేట్టు...

మణికంఠ శరణు...
ఓం పరమాత్మనే నమః

శివోహం

నీ పిలుపు వినబడే వరకు...
నా గొంతు ముగబోయే వరకు నీకు పిలుస్తూనే ఉంటా శివ నీ దయ అంటూ..

శివ నీ దయ.

శివోహం

ఆ నలుగురు ఎందుకో మిగిలారు...
నాకో పేరుందని మోసేందుకు కాబోలు...

శివ నీ దయ.

శివోహం

శివ...
నా ఆత్మయే నీ స్వరూపము...
నా బుద్ధియే పార్వతీదేవి...
నా ప్రాణములే నీ సహచరులు, లీలా పరికరములు...
నా దేహమే నీ దేవాలయం...
విషయభోగములను అనుభవించుటయే నీ పూజ...
నా నిద్రయే ధ్యాననిష్ఠ, సమాధిస్థితి...
నా రెండు చరణములు సంచరించునదంతయూ నీ ప్రదక్షిణయే...
నా నోటి ద్వారా మాట్లాడు మాటలన్నియూ నీ స్తోత్రములే...
ఒకటని ఏముందీ, ఎల్లప్పుడూ నేను ఏమేమి కర్మలు చేసెదనో, అవన్నియూ నా ఆరాధనయే అవుతుంది.
మహాదేవా శంభో శరణు.

Monday, December 25, 2023

ఓం నమో నారాయణ

ఓం నమో భగవతే వాసుదేవాయ 



ఈ లోకములో శాశ్వతం అయినదంటూ ఏదీ లేదు. లోకమే శాశ్వతం కానపుడు అందులో ఉండే వస్తు విషయాలు శాశ్వతం ఎలా అవుతాయి?! కనుక ఇది లేదు, అది లేదు, ఇది పోయింది, అది పోయింది అని ప్రతీ విషయానికి చింతిస్తూ కూర్చోకండి! దైవముపై భారము వేసి మీ ప్రయత్నము మీరు చేయండి. ఆత్మానందం కొరకే భగవంతుణ్ణి ద్యానించండి. జీవన ఉపాధి కోసం పరిస్థితులు సహకరించడం లేదని చింతించకండి.. ఎంతటి క్లిష్ట పరిస్థితి అయినా సరే భగవంతుని అనుగ్రహం చేత భస్మం కాక తప్పదు.

హరిహర శరణు

అలసిపోయిన  బాటసారి చెట్టు నీడను ఆశ్ర యించినట్లు
జలప్రవాహములొ కొట్టుకుపోయేవానికి చెక్క దొరికినట్లు
పెను తుఫాను వళ్ళ  భీతి చెందినవాడు ఇంటికి చేరినట్లు    
పొరుగూరినిమ్చి వచ్చి ఆతిధి గృహస్తుని ఆశ్ర యించినట్లు
దరిద్రుడు, పండితుడు ధర్మాత్ముడైన రాజును ఆశ్ర యించినట్లు 
అంధకారములొ అలమటిమ్చేవాడు దీపాన్ని ఆశ్ర యించినట్లు
మంచుతో ఉన్న చలికి వణికేవాడు అగ్నిని సమీపించి నట్లు  
సర్వభయాలు పోగొట్టి సమస్త సుఖాలు చెకూర్చె హరిహారుల పాదపద్మాలు కడిగి ఆశ్రయించి ప్రార్ధించుచున్నాను.

మహాదేవా శంభో శరణు.
హరి శ్రీహరి శరణు.

శివోహం

శివా!అరుణాచలాన అగ్నిలింగమై నీవు
అజ్ఞానమగుపించ ఆర్పివేసావు
జ్ఞానమై జ్యోతిగా బాట చూపేవు.
మహేశా . . . . . శరణు .

శివోహం

సదా నీతోనే సదాశివ...
నా సర్వం నీవే కదా...
శివ నీ దయ.

శివోహం

భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మికం రెండూ తన ప్రతిబింబమే...
తానే పార్వతి, తానే శివుడు... తానే సత్యం, తానే సర్వం తానే కేంద్రం...
తానే సర్వం తానే సర్వసం..
ఓం శివోహం...సర్వం శివమయం.
ఓం పరమాత్మనే నమః

Sunday, December 24, 2023

శివోహం

గోవిందా...
ఏనాడు ఏకాదశి ఉపవాసం ఉండలేదు...
ద్వాదశి భోజనం చేయలేదు...
మనస్సు తృప్తి పరిచే హరి కీర్తనలు శ్రవణం తప్ప
ఏనాడు పూజ, జపం, ధ్యానం, పురాణ పఠనం చేయలేదు...
హరి శ్రీహరి శరణు.

ఓం నమో వెంకటేశయా నమః
ఓం నమో నారాయణయా నమః
ఓం శ్రీమరమాత్మనే నమః

శివోహం

శివా!తరుణి రూపాన తలలోన మెరిసి
జాలువారేను  తాను జలముగా తెలిసి
పుణ్యఫల ప్రదమయ్యేను గంగ నిన్ను తాకి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
నివేదించడానికేముంది ఇంకా..
ప్రవహిస్తున్న కన్నీరుతో నిన్ను అభిషేకించడం తప్ప.
శివ నీ దయ.

Saturday, December 23, 2023

అయ్యప్ప

పంపావాస పాపవినాస
శబరిగిరీశ శ్రీ ధర్మ శాస్త్ర
అధ్భుతచరితా ఆనందనిలయా
స్వామి శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం

గణేశా

పార్వతీనందనం దేవం 
విఘ్నరాజం గణాధిపం
గజాననం మహావీర్యం 
వందే సిద్ధి వినాయకం 
భక్తప్రియం ఉమాపుత్రం
విశ్వవంద్యం సురేశ్వరం
అంబికా హృదయానందం 
వందే మూషికవాహనం 

ఓం గం గణపతియే నమః

శివోహం

శివా!కాలుతున్న ఈ చితి మంటలే
నీ మహా స్మశాన మంగళ తోరణాలై
మెరియు చున్నవి రేయి పగలు
మహేశా . . . . . శరణు .

Wednesday, December 20, 2023

శివోహం

శివా!మూడు కన్నులున్న మురిపెమేమి
కరచరణాదులు ఏవీ కాననీవు 
ఏ కంట చూస్తావో ఎరుగ నీయవు
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ చివరి జోల నువ్వు పాడేవరుకు 
నీ నామం,నీ ధ్యానం నీతోనే సావాసం.

శివ నీ దయ.

శివోహం

శివ
నీ గురించి నాకేమి తెలికపోయిన ఏదో చెప్పాలని తపన
నిన్ను ఎంతసేపు చూసినా అలా చూస్తూ ఉండాలని కోరిక
నీపై పదాలెన్ని అల్లి మహా గ్రంధం
వ్రాయాలని ఉత్సాహం...
ఎలా తీరేను ఈ శివదాహం...
శివ నీ నామామృతం ఒక్కటే మార్గమా...
త్రినేత్ర స్వరూపా హర శరణు.
మహాదేవా శంభో శరణు.

Tuesday, December 19, 2023

శివోహం

దిగులు వీడని దూరంలో నేను..
నీ చిన్నమాట కోసమని ఎదురుచూస్తూ.

శివ నీ దయ.

Monday, December 18, 2023

శివోహం

శివా!ఏ ఆస్థానమూ నేను కోరలేదు
నీ సంస్థానమున నన్ను కూడనిమ్ము
కూడి వుందును నేను కావలినై..
మహేశా . . . . . శరణు .

అయ్యప్ప

స్వార్ధము వీడి నిస్వార్ధమును ఎరిగి
నిజమగు సేవ  నిక్కచ్చిమై వెలుగు
నీ పాద సేవ నిరతము భక్తితో కొలవ
నిలుచు  నిరతము  సదా మదిలోన స్వచ్ఛముగా
హరిహర పుత్ర అయ్యప్ప శరణు.

శివోహం

కృష్ణా కృష్ణా యని కృష్ణా అష్టమి నాడు అవతరించితివి 
ఎంత నీ నామము చేయ తృష్ణ తీరకపోయే 
రాధ...
నిన్ను  కృష్ణా  కృష్ణా యని పరితపించి రాధాకృష్ణలుగా  ఖ్యాతిగాంచితిరి...
కృష్ణా కృష్ణా యని తలచినంతనే నీవు  అభయము ఒసంగితివి...
జన్మ జన్మలకు నీ నామమే సదా శరణము మాకు 
నీ ఒక్క నామముతో మమ్ములను తరింపచేసితివి 
నిన్ను...
కృష్ణా  కృష్ణాయని తలచినంతనే  కల్గు సర్వ శుభములు.

ఓం శ్రీకృష్ణపరమాత్మనే నమః.
ఓం నమో నారాయణ.

Friday, December 15, 2023

గోవిందా

చేతులు ఎత్తి మొక్కుతున్న అంటే చేసిన పాపాలు చేరిపేయ్మని కాదు...
చేసిన వాటిని మన్నించి,నీ చెంతకు చేర్చుకొని...
భక్తి మార్గమును నను నడిపించమని.
హరి శ్రీహరి శరణు.

ఓం నమో వెంకటేశయా.
ఓం పరమాత్మనే నమః

Thursday, December 14, 2023

అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

సిద్ధినీ బుద్ధినీ ప్రసాదించే తల్లీ...
భుక్తిని, ముక్తిని అనుగ్రహించే దేవీ...
మంత్రమూర్తీ
దివ్యకాంతిమయీ మహాలక్ష్మీ నీకు నమస్కారము.
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

శివా!సిగ పువ్వు సవరించి దిష్టి బొట్టును పెట్టె
కనుదృష్టి పడకుండ అమ్మ కాత్యాయిని
వీడనని వాడిపోనివ్వనని నీకు నేనేనని
మహేశా . . . . . శరణు .

శివోహం

కలలో కనిపించి కనువిందు చేస్తున్నవని రెప్పలు తెరిస్తే కనుమరుగయ్యే నీ రూపం వెతకలేక నేనూ ఓడిపోతున్నాను..

శివ నీ దయ.

శివోహం

మౌనమనే నా మనసు గదుల్లో...
మనసు పడే ఈ వేదన వెనుక...
మింగలేని మా బాధలు ఎన్నో ఉన్న...
మహ ప్రళయం లా దుఃఖాలెన్నీ వచ్చిన..
నీ నమస్మరణ మరువ...
మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...