Wednesday, March 27, 2024

ఓం నమో నారాయణ

ఒక్కొక్కసారి భగవంతుడే మన స్థిరచిత్తాన్ని పరీక్షించడానికి, పవిత్రకరించడానికి బాధలు కల్గిస్తాడు. అందుకే, సాధకుడు బాధల మధ్య చెదిరిపోకూడదు. మనల్ని మలిచేందుకు వచ్చినవే ఇవన్నీ అని భావిస్తూ, బాధలను దూరం చేయమని పరమాత్మను ప్రార్ధించక, బాధలను తట్టుకునే శక్తినివ్వమని పరితపించాలి.  బంగారు నగ శోభాయమానంగా తయారయ్యేముందు నిప్పుల్లో ఎంతగా కాలిందో, సమ్మెటపోట్లను ఎంతగా భరించినదో కదా. రోకలిపోటులకు ముక్కలుగాని బియ్యమే భగవదారాధనకు ఉపయోగపడే అక్షింతలైనట్లు, జీవితంలో దెబ్బల్లాంటి బాధలు తట్టుకొని విరగని చెదరని చిత్తదారులే భగవత్ప్రాప్తికి పాత్రులౌదురు

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...