https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
జీవితంఅంతులేనిదీ
జీవితం అంతుతేల్చలేనిది
ఉదయ సంధ్య ఎడారులలో
సాగిపోతుంటది.
ఎండమావి ఆశల వెంట
పరుగుబెట్టిస్తది
నల్లేరు ఎడారులలో
తింపుతూనె ఉంటది
అంతులేని ఆశల దిబ్బల
సంబరాల పంచేస్తూ
ఊహించని సుఖ జీవనంలో
ఆడిస్తూనే
విషాదా పాతాళాన పడవేసీ
మోహాల అంతులుజూపి
జీవన నాటక అంతరంగ తెరలలో
నీనటనే చూపించి విస్మయాల
గురిచేస్తది.
ఈమోహబంధాలకు
పొంగిపోక క్రుంగకు
అంతులేని ఆశల వెంట
అలసొలసి పడబోకు.
ఎండమావులేయవి
ఎదలనాడించేవి
జీవిత పరమార్థం తెలుసుకో
పవిత్రమై సాగిపో.
ఉన్ననాళ్ళు జీవితంలో
పొంగిపోకు
లేమిగల జీవితంలో
క్రుంగక కృశించిపోకు
ఇదే ఇదే జీవితం
తెల్లకాగితం వంటిదే
అంతరంగ పరమాత్మనుకలుసుకో
అదే బోధచేయులే.
ఓం నమః శివాయ.
No comments:
Post a Comment