Friday, June 7, 2024

శివోహం

సృష్టిలో దైవము తప్ప ఏదీ శాశ్వతము కాదు.. సృష్టిలో  అన్నింటికన్నా విలువైనది కాలము.. అట్టి కాలము కూడా శాశ్వతం కానపుడు, ఇంకా విలువలేనివి ఏ విధముగా శాశ్వతము అవుతాయి?! ఈనాడు మీకు జీవనము భారముగా ఉన్నదంటే కారణము కుటుంబ సమస్యలు కానే కాదు! కేవలము మీరు శాశ్వతములు అనుకున్నటువంటి అశాశ్వతములు వలనే మీకు  దుఃఖములు, కష్టములు!.  రోగికి టానిక్కులు బలాన్ని ఇస్తాయని జీవితమంతా టానిక్కులే తీసుకుంటారా?! లేదు కదా!! శరీరమునకు మంచి ఆహారము వలనే ఆరోగ్యము.. అది శరీరము పుష్టికి శాశ్వతము.. అలానే వస్తు విషయాలు, బందు మిత్రులు మొదలగు అందరూ అశాశ్వతము.. అశాశ్వతములు వలన కలిగే ఆనందం అత్యల్పమే అగును.. కానీ భగవంతుడు శాశ్వతుడు. కనుక ఆయన వలన కలిగే ఆనందము శాశ్వతము. ఇట్టి శాశ్వత ఆనందమును పొందాలంటే  దైవమును విడువక పట్టుకోవాలి. విషయాల పట్ల వాంఛలను వదులుకోవాలి.

No comments:

Post a Comment

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...