Sunday, June 9, 2024

శివోహం

*🙏🏻🌺 ఓం నమో భగవతే వాసుదేవాయ 🌺🙏🏻*



*_🌴 మార్పు కలిగేదే జీవితం.. నేడు మానవుడు ప్రతిదీ మార్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు..  ఉండడానికి ఇరుకుగా ఉందని ఇల్లు మారుస్తున్నాడు, నడపడానికి సౌకర్యంగా లేదని కారుని మారుస్తున్నాడు, పొగడ్తలు లేవని మనుష్యుల్ని మారుస్తున్నాడు, లాభం రావడం లేదని వ్యాపారం మారుస్తున్నాడు, చివరిగా కష్టాలు తొలగడం లేదని దేవుల్ని సహితం మార్చేస్తున్నాడు కానీ ... తనను తాను మాత్రం మార్చుకోవడం లేదు!! నీకు ఒకటి నచ్చలేదు అంటే సమస్య నీది తప్ప అవతలది కాదు!! కనుక ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి.. మంచి భావాలను కలిగి ఉండాలి.. చెడు భావాలు, చెడు అలవాట్లను వదలాలి.. దేవునిపై అపనమ్మకం వదిలి విశ్వాసవంతునిగా మారాలి. అపుడు ప్రతిదీ నీకు అనుకూలంగానే మార్పు చెందుతుంది .🌴_*

No comments:

Post a Comment

ప్రసన్న వదనం

 లంగా ఓణీ  వేసుకున్న అచ్చ తెలుగమ్మాయి... కాటుక సొగసుల మాటున కలువల్లాంటి తన కళ్ళు... దోరతనం పూసుకున్న దొండపండు లాంటి తన పెదాలు... చక్కిలి గిం...